Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

క్యాష్‌లెస్ ఆదర్శంగా తాళ్ళగూడెం

నగదు రహిత వినియోగం పరిశీలన చేసిన ప్రభుత్వ విప్ సునీత, కలెక్టర్ అనితా రామచంద్రన్

CASHLESS

మనతెలంగాణ/యాదగిరిగుట్ట : ప్రభుత్వ పిలుపు మేరకు నగదురహిత వినియోగంలో యాదాద్రి జిల్లాలోని నెం.1 ఆదర్శగ్రామంగా తాళ్ళగూడెం గ్రామం నిలిచిందని ప్రభుత్వవిప్ గొంగిడి సునిత మహేందర్‌రెడ్డి అన్నారు. యాదగిరిగుట్ట మండలంలోని తాళ్ళగూడెం గ్రామంలో సోమవారం రోజున ఏర్పాటుచేసిన నగదు రహిత కార్యాక్రమంలో ప్రభుత్వవిప్ సునిత, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ పాల్గొన్నారు. గ్రామంలోని చౌకధర దుకాణం, వ్యాపార సంస్థల వద్దకు, ప్రజల వద్దకు వెల్లి నగదు రహిత వినియోగం గురించి తెలుసుకుని పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వ విప్ మాట్లాడుతూ మండలంలోని అతిచిన్న గ్రామమైన తాళ్ళగూడెం ప్రభుత్వ పథకాలు ఇంకుడుగుంతలు, మరుగుదొడ్ల నిర్మాణం, హరితహారం, నగదురహిత అమలు పర్చడంలో జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా నిల్చిందని తెలిపారు. గ్రామంలో ఉన్న 100 నివాస గృహాల ప్రజలు ప్రతీఒక్కరు బ్యాంకులో ఖాతా పొంది ఉన్నారని గత నాలుగు రోజులుగా ఎస్‌బీఐ బ్యాంకు ఆధ్వర్యంలో వాలెంటర్లను ఏర్పాటుచేసి ఇంటింటికీ తిరిగి నగదురహిత అవగాహన కల్పించారని దీనితో గ్రామ ప్రజలు పూర్తిగా క్యాష్‌లెస్ వినియోగిస్తున్నారని తెలిపారు. గ్రామ సర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నికైన కసావు శ్రీనివాస్ గ్రామ అభివృద్ధికి ప్రజలను భాగస్వాములను చేయడం పట్ల అభినందించారు. ముఖ్యమంత్రి దృష్టికి గ్రామ అభివృద్దిని తీసుకెళ్లి ప్రత్యేకంగా నిధులను మంజూరు చేయించి మరిన్ని అభివృద్ధి పనులను చేయడానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. కలెక్టర్ అనితా రామచంద్రన్ మాట్లాడుతూ, నగదురహిత వినియోగంలో నూటిని నూరు శాతం తాళ్ళగూడెం గ్రామం ముందు నిల్చిందని, ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని జిల్లా వ్యాప్తంగా నగదు రహితాన్ని వినియోగించి రాష్ట్రంలోనే యాదాద్రి జిల్లాను మొదటిస్థానంలో ఉంచాలని కోరారు.  కార్యాక్రమంలో జాయింట్ కలెక్టర్ రమేష్ నాయక్, ఆర్డీవో భూపాల్‌రెడ్డి, ఎంపిపి గడ్డమీది స్వప్న, జడ్పిటిసి కర్రె కమలమ్మ, ఎంపిటిసి మాధవి, సర్పంచ్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Comments

comments