Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

నగదురహిత లావాదేవీలకు కార్యాచరణ రూపొందించాలి: జూపల్లి

Jupally-Krishna-Rao

హైదరాబాద్: పంచాయతీరాజ్ శాఖలో నగదురహిత లావాదేవీల అమలుపై బుధవారం ఉన్నతాధికారులతో మంత్రి జూపల్లి కృష్ణారావు సమావేశమయ్యారు. ఆసరా పింఛన్ల పంపిణీలో నగదురహిత లావాదేవీల అమలుపై మంత్రి సమీక్ష జరిపారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ… నగదురహిత లావాదేవీలకు కార్యాచరణ రూపొందించాలని అధికారులకు సూచించారు. త్వరలో బ్యాంకు, తపాలా అధికారులతో సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారు. ఆసరా పింఛన్‌దార్లకు బ్యాంకు లేదా తపాలా ఖాతా ఉండేలా చూడాలని తెలిపారు. బ్యాంకు, తపాలా సౌకర్యంలేని గ్రామాల్లో నగదు రహిత విధానం అమలు చేయాలని ఆయన ఆదేశించారు.

Comments

comments