Home కామారెడ్డి గిరిపుత్రుల…గిలగిల

గిరిపుత్రుల…గిలగిల

Castr-Occupation

బాన్సువాడ/పెద్దకొడప్‌గల్: సమస్యల వలయంలో తండాలు తల్లడిల్లుతున్నాయి. ప్రతినిత్యం గి రిజనం అవస్థలు పడుతున్నారు. పాలకుల పట్టింపులేని తనం.అధికారుల అలసత్వంతో తండాలలో ప్రగతి చా యలు కనిపించడం లేదు. మిగితా పల్లెల్లాగే తమ తండా లు కూడా అభివృద్ధికి చేరువ కావాలని ఉబలాటపడుతు న్నాయి. కనీస మౌలిక సదుపాయాలు లేక ఈ ప్రాంత వా సులు విలవిల్లాడిపోతున్నారు. అభివృద్ధి ఆమడ దూరం లో తండాలు ఉండటంతో వారి కష్టాలు చెప్పనలవి కాకుం డా ఉన్నాయి. వెనుకబడిన జాబితాలో తండాలు లేకుండా పోయాయి. జిల్లాలో అత్యధికంగా బాన్సువాడ, గాంధారి, పిట్లం, పెద్దకొడప్‌గల్, బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలా ల్లో ఎక్కువగా తండాలున్నాయి.

ఎక్కువ శాతం తండాల లో సమస్యలు తిష్ట వేశాయి. ఊరికి దూరంగా ఉంటున్న ట్లు గిరిపుత్రులు జీవనం సాగిస్తున్నారు. అందుకు చక్కని నిదర్శణంగా సర్ధార్ తండాను చెప్పుకోవచ్చు. సర్ధార్ గా తండా పేరు మారిమోగిపోతున్న ప్రగతిలో మాత్రం ఈ తండా బేఖార్‌గానే కనిపిస్తోంది.హామీలతో నేతలు సరిపె ట్టుకోవడం…అధికారులు ఆ తండాలలో అడుగే పెట్టకపో వడంతో పురోగతి కాస్తా పూర్తిగా డీలా పడిపోయింది. త ండా అభివృద్ధి కోసం గిరిపుత్రులు చకోర పక్షుల్లా ఎదురు చూస్తున్న పట్టించుకునే నాథుడు లేకుండా పోయాడు. గిరి బతుకులను బంగారు బాట పట్టిస్తున్నామని ప్రభుత్వం ప్రచారాన్ని మాత్రం ఆర్భాటంగా చెప్తున్నప్పటికీ క్షేత్ర స్థా యిలో వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా గోచరిస్తు న్నాయి. వ్యవసాయాధారంతో ఆధారపడ్డ వారి బతుకు లకు ప్రగతి మార్గం చూపించే నేతలు, అధికారులు కని పించకుండా పోవడంతో వారిలో తీవ్ర అసంతృప్తి సెగలు కమ్ముకుంటున్నాయి. ప్రతీ సారి ఎన్నికల సమయంలో వ చ్చే ఖద్దరు నేతల మాటలు నమ్మి తాము ఓట్లేస్తున్నామని, తరువాత తమ తండా వైపు చూసే లీడర్ లేడని వారు వాపోతున్నారు.

ఇదీ తండా పరిస్థితి….
తండాలో రెండొందలకు పైగా కుటుంబాలునివసిస్తు న్నాయి
మంటినీటి వసతులు అంతంతమాత్రంగానే ఉన్నాయి
దాహార్తిని తీర్చుకునేందుకు బోరు నీటిని సేవిస్తున్నారు
-విద్యుత్ కాంతులు విరాజిల్లక తండా
అందాకరంలో ఉంటుంది
రాత్రి వేళల్లో చీకటిలోనే మగ్గుతున్నారు
విష సర్పాలు, క్రిమికీటకాలతో ప్రజారోగ్యం గాడి తప్పింది
ప్రమాద వ్యాధిల బారిన పడి మృతి చెందిన సంఘటణలున్నాయి
తండాలో ఉన్న ప్రాథమిక పాఠశాలను పశువుల పాకగా తయారైంది
పశువుల కొట్టంగా తరగతి గదులు
పాఠాలు వినిపించే చోట పశువుల కేకలు వినిపించే పరిస్థితి
రోడ్లు సక్రమంగా లేకపోవడంతో గుంతలు మయంతో ఇబ్బందులు
పశువుల తొట్లే మంచినీటి ట్యాంకులు, బ ట్టలుతికే నీటి తొట్లు
అగమ్యగోచరంగా మారిన వైద్య సదుపాయాలు
బడి బాట పట్టని బడీడు పిల్లలు
సబ్సిడీ సరుకుల్లోను అన్యాయమే
హరితం వైపుకుపోని తండాలు
డ్రైనేజీ అస్తవ్యస్తం

సర్ధార్ తండాలో ప్రగతేది.?
జుక్కల్ నియోజక వర్గంలోని పెద్దకొడప్‌గల్ మండలంలో ఉన్న ఆధికశాతం తండాలు అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నాయి.బిచ్కుంద మండలంలోని ప్రధాన బాగమైన పె ద్దకొడప్‌గల్ ప్రాంతాన్ని మండలంగా ఏర్పాటు చేయడం తో పాటు ప్రగతి దిశగా జాడలు మాత్రం వేయలేకపోతు న్నారు. పేరులో సర్ధార్ అనే గంభీరత్వం వినిపిస్తున్నా ఇం టింటా మాత్రం రోగాల మూలుగులు వినిపిస్తున్నాయి. తండావాసులకు కనీస మౌళిక సదుపాయాలు కూడా లేక నానా అవస్థలు పడుతున్నారు. పెద్దలతో పాటు చిన్నారు లు కూడా ఇక్కట్లకు గురవుతున్నారు. బురదమయంగా మారిన తండాలో గిరిబతుకులు బీతిల్లిపోతున్నాయి. ఇ ప్పటికైనా తండాల రూపురేఖలు మార్చడంతో పాటు గిరి జనులకు కావాల్సిన వసతులు, సదుపా యాలు, తండాల ప్రగతి, విద్య వైద్యం రంగాలను ముందంజలోకి తీసుకుపోవాలని గిరిపుత్రులు కోరుతున్నారు.

పశువుల పాకగా పాఠశాల…
సర్ధార్ తండాలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రం పశువుల పాక గా మారింది. పిల్లలు ఓనమాలు నేర్చుకోవాల్సిన తరగతి గదులు ఎడ్లబళ్ల చక్రాలకు నిలువ అడ్డాలుగా మారాయి. రికార్డుల్లో అంగన్ వాడీ కేంద్రం కొనసాగుతున్న నిజానికి మాత్రం అంగన్‌వాడీ నిర్వహకులు చుట్టపు చూపు పాత్ర ను పోషిస్తున్నారు.పిల్లలు అఅలకు బదులు గిలీదాండు ఆటలు ఆడుకుంటున్నారు. ప్రతినెలా మాత్రం అంగన్‌వా డీల నిర్వహణ కింద ఖర్చులు మాత్రం లెక్కలోకి వస్తున్నా యి. విడుదలవుతున్న సరుకులు అంతంతమాత్రంగానే వారికి అందుతున్నాయి. పోష్టికాహరం పరిస్థితి దేవుడెరు గు అన్న చందంగా మారింది.

అధికారుల జాబితాలో తండాలు లేవా
పెద్ద కొడప్‌గల్ మండలంలోని తండాలు అధికారుల జా బితాలో లేవా అన్న అనుమానాలు వారిలో కలుగుతున్నా యి. గిరిజనుల అన్న కోణంతో తమను ప్రగతికి దూరంగా పెడుతున్నారని తండావాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా రు. అన్ని గ్రామాలలో పర్యటిస్తున్న మాదిరిగా తండాలలో అధికారులు ఎందుకు సందర్శించరని గిరిజన నాయకులు వాపోతున్నారు. ప్రజాప్రతినిధలు కూడా అదే ధోరణిని అ వలంభిస్తున్నారని, నాయకులు సైతం తమకేమి పట్టనట్లు గా వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.