Search
Thursday 22 November 2018
  • :
  • :
Latest News

అన్ని రంగాల్లో క్యాస్టింగ్ కౌచ్ : రేణుకా చౌదరి

RENUKA

ఢిల్లీ : క్యాస్టింగ్ కౌచ్ ఒక్క సినిమా పరిశ్రమలోనే లేదని, ఇది అన్ని రంగాల్లో ఉందని కాంగ్రెస్ అగ్రనేత రేణుకా చౌదరి పేర్కొన్నారు. సినిమా పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ పేర్కొంది. సరోజ్‌ఖాన్ వ్యాఖ్యలను రేణుకా చౌదరి సమర్థించారు. అన్ని రంగాల్లో పని ప్రాంతాల్లో మహిళలకు వేధింపులు ఉండవన్న అభిప్రాయం సరికాదని ఆమె పేర్కొన్నారు. క్యాస్టింగ్ కౌచ్‌పై దేశ వ్యాప్త ఉద్యమాలు రావాలని ఆమె అన్నారు. హాలీవుడ్‌లో ఉన్న మీటూ ప్రచారం తరహాలో భారత్‌లో కూడా పోరాడాలని ఆమె మహిళలకు పిలుపునిచ్చారు.

Casting Couch in all Fields : Renuka Chowdary

Comments

comments