Search
Wednesday 26 September 2018
  • :
  • :

క్యాట్-2016 ఫలితాలు విడుదల

CAT-2016 Results

ముంబయి: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, బిజినెస్ స్కూల్స్‌లో ప్రవేశం కోసం నిర్వహించే క్యాట్(కామన్ అడ్మిషన్ టెస్ట్)-2016 ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. 2016, డిసెంబర్ 4న ఈ పరీక్ష జరిగింది. దేశవ్యాప్తంగా 138 పరీక్ష కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షకు సుమారు లక్షా 95వేల మంది అభ్యర్థులు హాజరయ్యారు.

ఈ యేడాది క్యాట్‌ను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బెంగళూరు నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా, ఈసారి ఫలితాల్లో 20 మంది అభ్యర్థులు వందకి వంద శాతం మార్కులు సాధించారు. ఫలితాల కోసం అభ్యర్థులు www.iimcat.ac.in వెబ్‌సైట్‌లో చూడవచ్చని అధికారులు తెలిపారు.

Comments

comments