Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

కుక్కకు పిల్లి ట్రైనర్

Dog

పిల్లికి ఎలుక సాక్షమేమోకానీ కుక్కకు పిల్లి శిక్షణ ఇవ్వడం నివ్వెరపరుస్తోంది అమెరికాలో! పిల్లికి, కుక్కకు ఆగర్భ శత్రుత్వం ఉన్నా ఇక్కడ సైంట్‌లూయీస్‌లో మాత్రం గురుశిష్య సంబంధాలతో బతికేస్తున్నాయి. కుక్కకు రానిది, పిల్లికి మాత్రమే వచ్చిన విద్య యేమిటో..అని కొట్టిపారేయకండి. ఏ జాతికైనా సహనమే శ్రీరామరక్ష కదా! అదే నేర్పిస్తుందిట ఈ పిల్లి. ఇది ఏ కుక్కకు పడితే ఆ కుక్కకు ట్రైనింగ్ ఇవ్వదు. సర్వీస్ డాగ్స్‌కు, థెరపీడాగ్స్‌కు మాత్రమే శిక్షణ ఇస్తుంది. సర్వీస్ డాగ్స్‌ను ఎవరికి పడితే వారికి ఇవ్వరు. ముసలితనంతో, అనారోగ్యంతో, మతిస్థిమితంలేని తనంతో బాధపడేవారికి మాత్రమే ఇస్తారు. ఇలాంటి కుక్కలకు సహనంపాలు కాస్త ఎక్కువగానే ఉండాలి కదా..!

అందుకే అదేదో ఈ ఆవేశపు కుక్కలకు నేర్పించమంటూ ఈ పిల్లికి అప్పజెబుతుంటారు. ఇది కుక్క దగ్గరికి ధైర్యంగా వెళ్ళి దాని చెవిపట్టిలాగడం, కన్నుదగ్గర పొడవడం, ముక్కుపట్టి పీకడం, తోకపట్టి ఆడించడం లాంటి చిలిపిచేష్టలు చేస్తూ వాటి సహనాన్ని పరీక్షిస్తుంది. కుక్కలు కిక్కురుమనకుండా ఉంటే వాటికి తదుపరి ట్రైనింగ్ ఇవ్వడానికి ప్రమోట్ చేస్తారు. ఈ పిల్లిని పెంచుతున్న మెక్ కెర్రీ మాట్లాడుతూ కుక్కలకు శిక్షణ ఇచ్చేపనిలో పడ్డాక చాలా బిజీ అయిపోయాను. ఎప్పుడైనా బైటికి వెళదామంటే వీల్లేకుండా ఉంది. వేరే ట్రైనర్స్‌పెట్టుకుని శిక్షణ ఇప్పిద్దామంటే కుక్కలు మనుషుల మాటలు వినడంలేదు. దాంతో శిక్షణ చాలా స్లోగా సాగుతోంది. అందుకే ఈ పిల్లిని తెచ్చిపెట్టుకున్నాను. దీనికి DOG అని పేరు పెట్టాను అని చెబుతోంది. ఇది వచ్చాక కుక్కలు చెప్పినట్టు వింటున్నాయి. గొడవపెట్టకుండా అది చెప్పినట్టు చేస్తున్నాయి..అని సంబరపడిపోతోంది.

Comments

comments