Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

తెలంగాణ రాష్ట్ర పశుసంతతిగా ‘తూరుపు’ గుర్తింపు

OX

తెలంగాణ రాష్ట్ర పశుసంతతిగా ‘తూరుపు’ జాతి పశుగణం త్వరలో గుర్తింపు పొందనున్నది. మహబూబ్‌నగర్ జిల్లా  మన్నవూర్ అటవీ ప్రాంతంలో ప్రాథమికంగా ఈ జాతి పశువులను గుర్తించారు. అనేక శతాబ్దాలుగా తెలంగాణ రాష్ట్రం లో వర్ధిల్లుతున్న ఈ తూరుపు జాతి పశువులు దుర్భిక్ష పరిస్థితులను తట్టుకుని  నిలదొక్కుకునే సామర్థం కలిగినవి. తెలంగాణ రాష్ట్ర బయోడైవర్శిటీ బోర్డు (టిఎన్‌బిబి) అధికార యంత్రాంగం ఈ గుర్తింపు ప్రక్రియను వివరించారు.  వాటర్‌షెడ్ సపోర్టు సర్వీసెస్ అండ్ యాక్టివిటీస్ నెట్‌వర్క్ (డబ్లు ఎఎస్‌ఎస్ ఎన్) సహకారంతో ఈ పశుసంతతి పుట్టు పూర్వోత్తరాలు వివరించే నివేదిక రూపొందించారు. నేషనల్ బోర్డు ఫర్ యానిమల్ జెనెటిక్ రీసోర్సెస్‌కు ఈ నివేదిక సమర్పించారు. అక్కడి నుంచి త్వరలో నిర్ణ యం వస్తుంద ని ఆశిస్తున్నారు.

ఈ గుర్తిం పు ప్రక్రియ దాదాపు పూర్తి కావచ్చిందని, మరో రెండు  నెలల్లో  పూర్తవుతుందని  అధికారులు వెల్లడించారు. ఈ గుర్తింపు  నిర్ణయమైతే తెలంగాణ మొట్టమొదటి గుర్తింపు  పశుజాతిగా ‘తూరుపు’ రికార్డుకెక్కుతుంది. ప్రస్తుతం దేశం లో ప్రఖ్యాత ఒంగోలు  ఎద్దు (ఆంధ్రప్రదేశ్), కాంక్రేజ్ ’(గుజరాత్), పులికులం (తమిళనాడు), పశుసంతతి ప్రసిద్ధమయినవిగా  గుర్తింపు పొందాయి. వీటి సరసన ఇప్పుడు తెలంగాణ ‘తూరుపు’ చేరుతుంది. ఈ గుర్తింపు  వల్ల ఈ జాతి పశుసంతతిని సంరక్షించుకోడానికి అవకాశం కలుగుతుంది.

అయితే గత కొంత కాలంగా  గొల్ల, లంబాడా తెగల పెంపకంలో ఉండే ఈ జాతి  పశుసంపదను ఇప్పుడు ప్రత్యేకంగా గుర్తించవలసిన అవసరం ఏమిటి? అన్న ప్రశ్న ఎదురవుతోంది. అంటే బాగా  పొడిబారిన వాతావరణంలో ఇవి మనగలగడమే కాకుం డా ఎక్కడయినా 3 నుంచి 20 ఏళ్ళలో ఇవి పని చేయగలుగుతాయి. సాధారణంగా ఇతర జాతి పశువులు ఇంత తక్కువ వయసుతో పని ప్రారంభించలేవు. అంతే కాకుండా వీటి నిర్వహణ వ్యయం కూడా బాగా తగ్గుతుంది. ‘తూరుపు’ జాతి పశుసంతతిని గుర్తించే ముందు 100 ఎడ్ల జతలను 200 ఆవులను, 400 దూడలను, 100 ఎడ్లను అధ్యయనం చేశారు.

Comments

comments