Home తాజా వార్తలు 2.4 కోట్ల మందికి నోటీసులు

2.4 కోట్ల మందికి నోటీసులు

CBDTఐటి రిటర్న్ చేయనివారి జాబితా సిద్ధం చేసిన సిబిడిటి
చర్యలు చేపట్టాలని ఐటి శాఖలకు ఆదేశాలు

న్యూఢిల్లీ: ఐటి రిటర్న్‌లను దాఖలు చేయనివారు, పన్ను రిటర్న్‌లను దాఖలు చేయకుండా డ్రాప్ అయినవారిపై సిబిడిటి చర్యలు చేపట్టింది. ఇలాంటి వారిపై జరిమానా విధించాలంటూ సిబిడిటి(సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్) ఆదాయం పన్ను శాఖలను ఆదేశించింది. దీనికి గాను జూన్ 30 గడువు ఇచ్చింది. 2013 నుంచి 2017 మధ్య కాలంలో ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయనివారు, డ్రాప్ అయిన వారంతా కలిపి మొత్తం 2 కోట్ల 4 లక్షల మంది ఉన్నారని సిబిడిటి పేర్కొంది. వీరిలో 25 లక్షల మంది తరచూ డ్రాప్ అవుతున్న వారు ఉన్నారని వెల్లడించింది. రిటరన్స్ ఫైల్ చేయనివారందరికీ నోటీసులు పంపాల్సిందిగా సిబిడిటి పేర్కొంది. ఆదాయపు శాఖ దగ్గరున్న నాన్ ఫైలర్ మానిటరింగ్ సిస్టమ్ (ఎన్‌ఎంఎస్) గణాంకాల ప్రకారం, దేశంలో 20.4 మిలియన్స్ మంది ట్యాక్స్ రిటరన్స్ చేయడంలో విఫలవవగా, వీరిలో సుమారు 20.5 లక్షల మంది డ్రాపర్స్ గా ఉన్నారు. వీరందరికి నోటీసులు పంపబోతున్నామని, నోటీసులకు తగిన సమాధానాలు రాక పోతే చర్యలకు ఉపక్రమిస్తామని ఆదాయపు పన్ను వర్గాలు తెలిపాయి.

ఆదాయం పన్ను చట్టం సెక్షన్ 271ఎఫ్, అలాగే సెక్షన్ 234 ప్రకారం, నాన్ ఫైలింగ్ కింద జరిమానా విధిస్తారు. ఆగస్టు 31లోపు తమ ఆదాయపు వివరాలను వెల్లడించాలి. ఒక వేళ వారు ఆలస్యంగా పన్ను రిటర్న్ సమర్పిస్తే దానికి గాను రూ. 5,000 పెనాల్టీగా చెల్లించాల్సి ఉంటుంది. దీనికి డిసెంబర్ 31వరకు గడువు ఉంటుంది. డిసెంబర్ 31 తరువాత ట్యాక్స్ ఫైలింగ్ చేస్తే రూ. 10,000 జరిమానాగా విధిస్తారు. ఇందులో మినహాయింపులు కూడా ఉన్నాయి. ఏటా రూ. 5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారైతే గరిష్ఠంగా జరిమానా రూ. 1000 వరకే ఉంటుందని ఆదాయపు శాఖ వర్గాలు పేర్కొన్నాయి. దేశంలో పన్ను పరిధిని పెంచేందుకు తగు చర్యలు చేపడుతున్నామని సిబిడిటి తెలిపింది. దీనిలో భాగంగానే ఎన్‌ఎంఎస్ గణాంకాల ఆధారంగా పన్ను రిటర్నస్ చేయని వారు, డ్రాప్ అయినవారి జాబితాను సిద్ధం చేశామని ఆదాయం పన్నుశాఖ వర్గాలు తెలిపాయి. దీని ప్రకారం నోటీసులు జారీ చేస్తున్నామని వివరించారు.

CBDT Identifies 20.4 Million Non Filers