Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

కొత్త పన్ను చెల్లింపుదారులు కోటికి పైనే…

CBDT orders are required to bring in income tax under this year

ఈ ఏడాదిలో వారిని ఆదాయం పన్ను పరిధిలోకి తీసుకోవాలని సిబిడిటి ఆదేశాలు
హైదరాబాద్, పుణె నగరాల నుంచే ఎక్కువ
పన్ను పరిధిలోకి మరింత మందిని చేర్చాలనే లక్షం వేగవంతం

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 1.25 కోట్ల మంది కొత్త పన్ను చెల్లింపుదారులను చేర్చుకోవాలని ఆదాయం పన్ను శాఖను సిబిడిటి(కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు) ఆదేశించింది. పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్ వంటి రాష్ట్రాల నుంచి పన్ను దాఖలు చేసేవారు ఎక్కువగా ఉన్నారు. ఈ రాష్ట్రాల్లో ఆర్థిక కార్యకలాపాలు పెరగడంతో పన్ను చెల్లించేవారు పెరిగారు. పన్ను పరిధిలోకి చెల్లింపుదారులను పెంచాలనే ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా సిబిడిటి ఈ ఆదేశాలు జారీ చేసింది. గతంలో ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో సత్ఫలితాలను ఇచ్చింది. 201718 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం పన్ను పరిధిలోకి 1.06 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు చేరారు. గత ఆర్థిక సంవత్సరంలో కొత్త ఐటి రిటర్న్ దాఖలు చేసినవారిని పరిగణనలోకి తీసుకోలేదు, అయితే చట్టం పరిధిలోకి వచ్చారు. తాజాగా ఐటి శాఖ వారిని చేర్చుకుని, ఐటి రిటర్న్ దాఖలు వెసులుబాటు కల్పించనుంది. అత్యధికంగా హైదరాబాద్ నుంచి 12.8 లక్షలు, పుణె 11.8 లక్షల మంది కొత్త వారిని డిపార్ట్‌మెంట్ చేర్చుకోవాల్సి ఉంది. ఆ తర్వాత చెన్నై నుంచి 10.47 లక్షలు, చండీగఢ్ నుంచి 10.41 లక్షల మంది కొత్త పన్ను చెల్లింపుదారులు ఉన్నారు. ఇటీవల ఢిల్లీలో ఐటి ఉన్నతాధికాకులతో నిర్వహించిన కార్యక్రమంలో దేశవ్యాప్తంగా పన్ను పరిధిలోకి ఎక్కువ మందిని చేర్చుకోవాలనే అంశంపై చర్చి, తుది నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్త పన్ను చెల్లింపుదాల సంఖ్య పెద్ద సంఖ్యలో ఉండాలనేది సిబిడిటి లక్షంగా ఉంది. స్వచ్ఛందంగా ముందుకు వచ్చేవారి కోసం ఏర్పాటు చేసిన ఆపరేషన్ క్లీన్ మనీ పోర్టల్‌పై దృష్టి పెట్టాలని ఐటి అధికారులను సిబిడిటి ఆదేశించింది. అధికారుల గణాంకాల ప్రకారం, 201617 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రిటర్న్‌లు దాఖలు చేసినవారి సంఖ్య(ఎలక్ట్రానిక్ + పేపర్) 5.43 కోట్లుగా ఉంది. ఇవి 201516 ఆర్థిక సంవత్సరంలోని రిటర్న్‌లతో పోలిస్తే 17.3 శాతం ఎక్కువగా ఉన్నాయి. 201617 ఆర్థిక సంవత్సరానికి 1.26 కోట్ల మంది కొత్త పన్ను చెల్లింపుదారులను టాక్స్ పరిధిలోకి చేర్చుకున్నారు.

Comments

comments