Search
Sunday 23 September 2018
  • :
  • :

నల్ల ఖాతాల పనిపడతాం

Anita-Kapurన్యూఢిల్లీ : ఈనెల 30 తర్వాత నల్లకుబేరుల సంగతి చూస్తామని సిబిడిటి (కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు) హెచ్చరికలు చేసింది. విదేశాల్లో దాచుకున్న నల్లధనం వివరాలను వెల్లడించేందుకు ఏ ర్పాటు చేసిన కాంప్లియన్స్ విండోను వినియో గించు కోవాలని సూచించింది. ఒకవేళ ఈ అవకా శాన్ని సదరు వ్యక్తులు నిర్లక్షం చేసినట్లయితే తద నంతరం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ప్రక టించింది. 90 రోజుల కాంప్లియన్స్ విండో(ఒక సారి నల్లధనం వివరాల వెల్లడి)కు సెప్టెంబర్ 30 వరకు గ డువు విధించారు. ఈనెల 30 లోగా ఎవరైతే విండోకు అందుబాటులో ఉండి చట్టవిరుద్ధ ఆదాయం గురించి వివరాలను వెల్లడిస్తారో వారికి వేధింపుల నిరోధం, గోప్యత అనుకూల విధానాలను అమలు చేస్తా మని సంస్థ పేర్కొంది. ఆ తర్వాత డిసెంబర్ వరకు పన్నుల చె ల్లింపు, జరిమానా విధిస్తామని ఆదాయం పన్ను వి భాగం అత్యున్నత సంస్థ సిబిడిటి వెల్లడించింది.

నల్లధ నం వివరాలను వెల్లడించని పక్షంలో తర్వాత పర్యవ సానాలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. విండోను వినియోగించుకోనట్లయితే ఆయా వ్యక్తులు ఉద్దేశపూ ర్వకంగా విదేశీ ఆస్తులను దాచిపెట్టారనే నిర్థారణకు వస్తామని, అనంతరం చట్టం ప్రకారం ముందు వెళ తామని సిబిడిటి చైర్‌పర్సన్ అనితా కపూర్ అన్నారు. దేశీయంగా, అంతర్జాతీయంగా బోర్డును మరింత పటిష్టం చేయనున్నామని, భారత్‌లో పన్ను సంస్కృతి ని పాడు చేసేందుకు ప్రయత్నించే వారిపై కఠినంగా వ్యవహరించి, ఆ వ్యక్తులను పట్టుకునే సామర్థం కో సం ప్రయత్నిస్తున్నామని ఆమె అన్నారు. కొత్త నల్లధన వ్యతిరేక చట్టం కింద ప్రజలను వేధిస్తున్నారనే ఆరోప ణలను కపూర్ తిప్పికొట్టారు. నల్లధనం చట్టం ఇంకా పూర్తి స్థాయిలో అమల్లోకి రాలేదని, గోప్యతను పాటిం చడం ద్వారా దీనిని మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు. ఈనెల 30 తర్వాత ఇది అమల్లోకి వస్తుంద ని, పన్ను అధికారుల తీరు వల్ల అక్రమ ఆదాయం కల్గి న వారు భయాందోళన చెందుతున్నారని అన్నారు.

కొత్త చట్టం ప్రకారం వేధింపులకు అవకాశం లేదని, కాంప్లియన్స్ విండోను, నిబంధనలను చాలా జాగ్రత్త గా రూపొందించామని ఆమె వివరించారు. ఈ కేసుల ను పరిష్కరించేందుకు దేశవ్యాప్తంగా ఒక్క అధికారిని మాత్రమే నియమించాం. విండోను వినియోగించుకు నేందుకు అధికారి వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదని, ఈ-ఫైలింగ్‌ను వినియోగించుకోవచ్చని, తర్వాత సద రు వ్యక్తులపై ఎలాంటి విచారణలు చేపట్టబోమని క పూర్ చెప్పారు. ఆదాయం పన్ను 138 సెక్షన్ కింద పూర్తి గోప్యతను పాంటించనున్నామని తెలిపారు. కొ త్త చట్టం ప్రకారం, నల్లధనం వివరాలను వెల్లడించ కుంటే 120 శాతం జరిమానా, పదేళ్ల వరకు జైలు వి ధిస్తారు. ఈ కఠినమైన శిక్షనుంచి తప్పించుకునేందు కు 90 రోజుల విండోను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

Comments

comments