Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

ఉన్నావ్ అత్యాచారం కేసులో సిబిఐ చార్జిషీటు

BJP-MLA

లక్నో: ఉన్నావ్ అత్యాచారం కేసులో సిబిఐ అధికారులు శనివారం ఐదుగురు నిందితులపై చార్జిషీటు దాఖలు చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో 4 జూన్, 2017న 17 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురైన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సంఘటనలో బిజెపి ఎంఎల్ఎ కుల్దీప్ సింగ్ సెంగార్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ప్రస్తుతం సీతాపూర్ జైలులో అతను శిక్షను అనుభవిస్తున్నాడు. ఎంఎల్ఎ తమ్ముడు అతుల్‌సింగ్ సెంగార్ కేసులో మరో నిందితుడిగా ఉన్నాడు. బాధితురాలి తండ్రి జ్యూడిషియల్ కస్టడీలో ఉండగా మృతిచెందాడు. ఈ క్రమంలో కేసు విచారణ చేపట్టిన సిబిఐ ఏప్రిల్ 13న అత్యాచార ఆరోపణల కింద బిజెపి ఎంఎల్ఎను అదుపులోకి తీసుకున్నారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 363 కిడ్నాప్ సెక్షన్ 366 మహిళను అపహరించడం, సెక్షన్ 376అత్యాచారం, సెక్షన్ 506 ఉద్దేశపూర్వక నేర ప్రవృత్తి కింద పలు కేసులు నమోదు చేశారు. అయితే ఎఫ్‌ఐఆర్ వాపసు తీసుకోవడానికి నిరాకరించిన కారణంగా బాధితులను బెదిరింపులకు గురిచేస్తూ ఎంఎల్ఎ సోదరుడు అతని అనుచరులతో కలిసి మరోసారి బాధిత బాలికను అత్యాచారం జరిపాడు.అంతేకాకుండా అడ్డుపడిన బాలిక తండ్రిని హింసించాడు.

Comments

comments