Home కరీంనగర్ నిఘా నేత్రంతో బతుకు భద్రం

నిఘా నేత్రంతో బతుకు భద్రం

దాతలకు ఆత్మీయ సన్మానం
పార్లమెంట్ సభ్యులు బి.వినోద్‌కుమార్

Vinod

కరీంనగర్‌టౌన్: నిఘా నేత్రాలు ఉంటేనే బ తుకు భద్రంగా ఉంటుందని పార్లమెంట్ సభ్యులు బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. ఆదివారం కరీంనగర్‌లోని 41వ డివి జన్‌లో కమ్యూనిటి నిఘా నేత్రాల దాతలకు కార్పొరేటర్ చల్ల స్వరూపరాణి -హరిశంకర్‌ల ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపి పాల్గొని మాట్లాడు తూ శాంతి భద్రతల పరిరక్షణకు, నేరాల అదుపునకు సామా జిక నిఘా నేత్రాలు దోహద పడుతాయన్నారు. తెలంగాణ ప్ర భుత్వం శాంతి భద్రతల పరిరక్షణకు ముందు నిలుస్తుందని తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో 41వ డివిజన్‌లో 126 సిసి కెమెరాలు 21 లక్షల వ్యయంతో ఏర్పాటు చేయడం

అభినం దనీ య మ ని అన్నారు. సేఫ్ డివి జన్‌గా నిలిచేందుకు అ వగాహన పరిచి డివిజన్ ప్రజల ను భాగస్వామ్యం చేయడం పట్ల కార్పొ రేటర్ చల్లా స్వరూపరాణి-హరిశంకర్‌ల చొరవ చూప డాన్ని ఈ సందర్భంగా ప్రశంసించారు. నిఘానేత్రాల ఏర్పాటు వలన డివిజన్‌లో ఎలాంటి సంఘటనలు జరిగినా తెలుసుకు నేందుకు వీలుంటుందని, దొంగతనాలు కూడా అరికట్టవచ్చ న్నారు. నిఘా నేత్రాల ఏర్పాటుకు ముందుకచ్చిన దాతల సేవ లను నగర ప్రజలు, డివిజన్ ప్రజలు మరువలేరని అన్నారు. డి విజన్‌లో దాతల సహకారంతో తొలిసారిగా ఏర్పాటు చేయడం ఎంతో హర్షించదగ్గ విషయమని అన్నారు. శాసన సభ్యులు గంగుల కమలాకర్ మాట్లాడుతూ నగరాన్ని సర్వాంగ సుం దరంగ తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్షమన్నారు.

అందరి సహ కారంతోనే నగరం అభివృద్ధి చెందుతుందన్నారు. ఎమ్మెల్సీ నా రదాసు లక్ష్మణ్ రావు మాట్లాడుతూ నగరాభివృద్ధికి ఎన్ని ని ధులైన కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. నిఘా నేత్రాలను అందించిన దాతల సేవలను ప్రజలు మరువ రన్నారు. మేయర్ రవీందర్ సింగ్ మాట్లాడుతూ సిసికెమెరాల ద్వారా నగరంలో, డివిజన్‌లో జరిగిన సంఘటనలు తెలుసుకు ని పట్టుకునే వీలుంటుందని తెలిపారు. స్మార్ట్ సిటి సాధనలో ప్రతీ పౌరుడు ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందిం చాలన్నారు. అనంతరం నిఘా నేత్రాల దాతలకు ఎంపీ వినోద్ కుమార్, జెడ్పిచైర్‌పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్యే గంగుల కమలా కర్, ఎంఎల్‌ల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, నగర మేయర్ సర్దార్ రవీందర్ సింగ్‌లు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమ ంలో ఎసిపి జె.రామరావు, టూటౌన్ సిఐ కె.హరిప్రసాద్, డివి జన్ ప్రజలు, కార్పోరేటర్‌లు పాల్గొన్నారు.

తొలిసారిగా డివిజన్ వెబ్‌సైట్ ప్రారంభం

నగరంలోని 41వ డివిజన్‌లో కార్పొరేటర్ చల్ల స్వరూపరాణి -హరిశంకర్‌లు ఆ డివిజన్ ప్రజల సంక్షేమానికోసం పూర్తి సమాచారాన్ని సేకరించి ‘మీకోసం.కెఎన్‌ఆర్’ అనే వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. ఈ వెబ్‌సైట్‌ను ఆదివారం ఎంపీ బోయినప ల్లి వినోద్‌కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపి మాట్లాడుతూ డివిజన్‌లో వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేయడం రా ష్ట్రంలోనే ప్రథమం అని అన్నారు. నగరంలోని అన్ని డివిజన్ లో కూడా కుటుంబాల డాటాను సేకరించుకుని వెబ్‌సైట్‌లో పొందుపరిస్తే సంక్షేమ ఫలాలకు, ఇతరత్ర కార్యక్రమాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అనంతరం కార్పొ రేటర్‌ను వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసినందుకు అభినందించారు.