Search
Friday 16 November 2018
  • :
  • :

నేరాల నియంత్రణకే సిసి కెమెరాలు

Police1

రాయపర్తి : మండలంలో శాంతి భద్రతలను పరిరక్షించుటకు, నేరాలను నియంత్రణ కోసం వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై మండల కేంద్రంలో సిసి కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందని, వీటి ద్వారా నేరాలను అదుపులోకి తీసుకరావడం జరుగుతుందని కమీషనర్ ఆప్ పోలీసు సుదీర్ బాబు అన్నారు.

గురువారం రాయపర్తి మండల కేంద్రంలోని స్థానిక పోలీసు స్టేషన్‌లో సిసి కెమెరాలను ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 14  స్మార్ట్ పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేయడం జరిగిందని, గత సంవత్సరం  కంటె ఈసంవత్సరం నేరాలు తగ్గుముఖం పట్టాయన్నారు. స్వశక్తి శిక్షణా ద్వారా జిల్లాలోని మహిళలకు, విద్యార్థులకు 52 నిమిషాల పాటు ఆత్మ రక్షణ కోసం 21276 మందికి శిక్షణ ఇచ్చి దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచి గిన్నీస్ బుక్‌లో వరంగల్ కమీషనరేట్ స్థానం కల్పించిందన్నారు. సిసి కెమెరాలతో పలు రకాల లాభాలు ఉన్నాయని, ప్రజల్లో భద్రతాభావం పెరుగుతుందని, నేరాలు చేయడానికి నేరస్తులు జంకుతారన్నారు.

మోడ్రెన్ పోలీసింగ్‌లో భాగంగా సిసి కెమెరాలను ఏర్పాటు చేసి పుటేజీల ద్వారా ఎలాంటి నేరస్తులనైన పట్టుకోవడానికి వీలవుతుందన్నారు. జిల్లాలో చైన్ స్నాచింగ్‌లను అదుపులో పెట్టడం జరిగిందని, 75శాతం రీకవరీ చేయడం జరిగిందని, బహిరంగ ప్రదేశాలలో మద్యపాన నిషేదాన్ని అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలంతా సహకరించి స్నేహపూర్వక పోలీసింగ్‌కు సహకరించాలని ఆయన కోరారు. ఈకార్యక్రమంలో డిసిపి వెంకన్న, ఎసిపి మహేందర్, సిఐ ఆదినారాయణ, ఎస్‌ఐ శ్రీధర్, సిబ్బంది రమేష్, శ్రీదర్, సత్యనారాయణ, ప్రిన్సిపాల్ జ్యోతి, ఎంపిపి విజయ నామా, జెడ్‌పిటిసి యాకమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Comments

comments