Home తాజా వార్తలు శాంతి భద్రతల పరిరక్షణ కోసం సిసి కెమెరాలు : డిజిపి

శాంతి భద్రతల పరిరక్షణ కోసం సిసి కెమెరాలు : డిజిపి

DGP

హైదరాబాద్ : శాంతిభద్రతల పరిరక్షణ కోసమే నగరంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలంగాణ డిజిపి మహేందర్‌రెడ్డి తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో సిసి కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన చెప్పారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ నగరంలో పది లక్షల సిసి కెమెరాలను ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు. ప్రజల రక్షణ కోసం సిసి కెమెరాల ఏర్పాటు అనివార్యమని ఆయన చెప్పారు. సిసి కెమెరాల ఏర్పాటుతో గొలుసు చోరీలు తగ్గుముఖం పట్టాయని ఆయన తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజల సహకారం విధిగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

CC Cameras for the Preservation of Peace and Security : DGP