Search
Saturday 22 September 2018
  • :
  • :

నత్తనడకన సీసీ రోడ్ల నిర్మాణ పనులు

CC-Roadsవనపర్తి: జిల్లా కేంద్రంలోని 13వ వార్డు లో రెండు సంవత్సరాలుగా సిసిరోడ్ల నిర్మాణం పూర్తికా కుండా పెండింగ్ దశలోనే కొనసాగుతుంది. శుక్రవారం 13వ వార్డులో గల సమస్యలపై ,వార్డు అభివృద్ది పనులపై కౌన్సిలర్ నందిమల్ల శారదాతో మన తెలంగాణ ముచ్చ టించారు.2015 సంవత్సరంలో నాన్‌ప్లాన్ గ్రాంట్స్ క్రింద సీసీరోడ నిర్మాణానికి కౌన్సిల్ సమావేశంలో లోఎస్ట్ టెండ ర్ ద్వారా రూ. 4 లక్షల సిసిరోడ్ల నిర్మాణం పనిని కాం ట్రాక్టర్ రాజేందర్‌రెడ్డి తీసుకోవడం జరిగింది. అనంతరం కాంట్రాక్టర్ రాజేందర్‌రెడ్డి సబ్‌కాంట్రాక్టర్ శివకుమార్‌రె డ్డికి సీసీరోడ్ల నిర్మాణం పనులు అప్పగించడం జరిగింది.

టెండర్ దక్కించుకున్న తర్వాత పనులను మూడు నెలల్లో పు పనులను పూర్తి చేయాల్సి ఉండగా నిబందనలకు విరుద్దంగా రెండు సంవత్సరాలవుతున్న నేటికి సంబందిత అధికారులు కాంట్రాక్టర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకపో వడం విశేషం..? రూ. 4 లక్షల రూపాయలు నాన్‌ప్లాన్ గ్రాంట్స్ క్రింద మంజూరు కాగా కేవలం అందులో రూ. 1 లక్షా 80 వేల రూపాయల పనులను చేసి మిగతా పనులు చేయకుండా విడిచిపెట్టడం జరిగింది.ఇదే విషయం పై దాదాపు రెండు సంవత్సరాలుగా పట్టణాభివృద్దికోసం నిర్వహించే మున్సిపల్ సమావేశంలో అదికారుల ,చైర్మన్ దృష్టికి పలుమార్లు సమస్యలు తీసుకువెళ్లిన త్వరలోనే పూర్తిచేస్తామని చెబుతున్నారే తప్పా పనులు మాత్రం ముం దుకు సాగడం లేదని కౌన్సిలర్ వివరించారు. ఇప్పటికై నా మున్సిపల్ అధికారులు స్పందించి సిసిరోడ్లను వేయా లని కాలనీ వాసులు కోరారు.
పలుసార్లు కమిషనర్,చైర్మన్,డిప్యూటీ ఇంజనీర్‌లకు కౌన్సిలర్ వినతి పత్రాలు

కౌన్సిలర్ నందిమల్ల శారదా…
తమ వార్డులో సీసీ రోడ్ల నిర్మాణం 20 15లో పూర్తి చేయా ల్సిన నిర్మాణం పెం డింగ్ దశలో ఉందని  పలుమార్లు మున్సి పల్ కమీషనర్ గోప య్య, చైర్మన్ రమేష్ గౌడ్, డిప్యూటి ఇంజ నీర్ సురేష్‌లకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని సమస్య పరిష్కారం కావడం లేదని కౌన్సిలర్ నందిమల్ల శారదా తెలిపారు. పెండింగ్ సీసీరోడ్ల నిర్మాణం కోసం మున్సిపల్ సమా వేశంలో సమ స్యల గురించి ప్రస్తావిస్తుంటే అధికారులు స్పందించకుం డా నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నా రని ఆమె తెలి పారు. వెంటనే కాంట్రాక్టర్‌ను పిలిపించి మి గతా పెండిం గ్ సీసీ రోడ్లను నిర్మించాలని ఆమె కోరారు.

త్వరలోనే రిటెండర్ వేయించి పనులను పూర్తి చేస్తాం.. కమీషనర్ గోపయ్య…
13 వ వార్డులో సిసిరోడ్ల నిర్మాణం కాంట్రాక్టర్ రాజేందర్ రెడ్డి వల్ల జాప్యం జరిగిందని త్వరలోనే రిటెండర్‌ను వేయించి నూతన కాంట్రాక్టర్ ద్వారా పెండింగ్‌లో ఉన్న సిసిరోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని కమీషనర్ గోపయ్య తెలిపారు.
కాంట్రాక్టర్ రాజేందర్‌రెడ్డికి నోటీస్‌లు జారీ చేశాం..

డిప్యూటీ ఇంజనీర్ సురేష్..ఎస్ట్ టెండర్ ద్వారా తీసుకున్న పనులను పూర్తి చేయ కుండా జాప్యం చేస్తున్న కాంట్రాక్టర్ రాజేందర్ రెడ్డికి నోటీ స్‌లు జారీ చేయడం జరిగిందని డిప్యూటీ ఇంజనీర్ సురేష్ తెలిపారు. నూతన టెండర్‌ను వేసి ఈ నెలలో నిర్వహించే సర్వసభ్య సమావేశంలో కౌన్సిల్ తీర్మాణంలో ప్రవేశపెడ తామని ఆయన ఫోన్‌లో తెలిపారు.

Comments

comments