Home జిల్లాలు మల్దకల్‌లో ఘనంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన

మల్దకల్‌లో ఘనంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన

mbnr2మల్దకల్: మండల కేంద్రమైన మల్దకల్‌లో 25లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన శ్రీఆంజనేయ స్వామి ఆలయ పునర్‌ప్రతిష్ట, ద్వజస్తంభ ప్రతిష్ట, గ్రామ లక్ష్మి ప్రతిష్టలను సోమవారం వేద పండితుల మంత్రోచ్ఛ రణల మధ్య ఘనంగా నిర్వహించారు. దశమికట్ట దగ్గర నూతనంగా ఏర్పాటు చేసిన గ్రామలక్ష్మి బొడ్రాయిని బెం గుళూర్ మఠం పిఠాధిపతి శ్రీ త్రివిక్రమతీర్థ ప్రసాద్‌లు ప్రతిష్టించారు. అనంతరం ఆంజనేయస్వామి ఆలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన నంది, శివలింగం, వినాయ కుని విగ్రహాలను ప్రతిష్టించారు. ఆంజనేయస్వామి ఆల యంలో స్వామిజీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంజనే యస్వామి ఆలయం ఎదుట భారీ క్రేన్‌తో ధ్వజస్తంభాన్ని ప్రతిష్టించారు. ధ్వజస్తంభ ప్రతిష్ట క్యాక్రమాన్ని తిలకించేం దుకు గ్రామస్తులతో పాటు చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. గ్రామంలో మొత్తం గోవింద నామస్మరణతో మారుమ్రోగింది. గద్వాల ఎమ్మెల్యే డికె. అరుణ, మున్సిపల్ ఛైర్‌పర్సన్ బండలపద్మావతి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా డికె.అరు ణ ఆంజనేయ స్వామి ఆలయానికి లక్ష విరాళం అందజే శారు. అలాగే టిఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జీ బండ్లకృష్ణ మోహన్‌రెడ్డి, ఎంపిపి సవారమ్మ, జడ్పిటిసి భాస్కర్‌లు హాజ రై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వాహకులు, అర్చకులు ఎమ్మెల్యే అరుణ, కృష్ణమో హన్‌రెడ్డిలకు వేరువేరుగా స్వాగతాలు పలికి శాలువాలు కప్పి మెమోంటోలు అందజేశారు. కార్యకర్తంలో కాంగ్రెస్ నాయకులు గడ్డంకృష్ణారెడ్డి, మున్సిపల్ వైస్‌ఛైర్మన్ శంకర్, పటేల్ ప్రభాకర్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, సర్పంచు దామనా గరాజు, ధర్మారెడ్డి, శేషంపల్లితిమ్మారెడ్డి, ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, మల్ధకల్ ఎంపిటిసిలు ఎల్కవెంకటన్న, తిమ్మ ప్పసుజాత, బండ్ల రాజశేఖర్‌రెడ్డి, మాజీ సర్పంచు నరేందర్, తదితరులు పాల్గొన్నారు.