Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

ఘనంగా లెనిన్ జయంతి వేడుకలు

Celebrations  of Lenin Jayanti in hyderabad

Celebrations of Lenin Jayanti in hyderabad

మన తెలంగాణ/ముషీరాబాద్ : మహత్తర అక్టోబర్ విప్లవానికి నాయకత్వం వహించి విజయవంతం చేసిన  లెనిన్ 148వ జయంతి వేడుకలతో పాటు సిపిఐ ( ఎం.ఎల్) న్యూడెమోక్రసీ పార్టీ పుట్టిన రోజు వేడుకలను  విద్యానగర్ సీపీ భవనంలో న్యూడెమోక్రసీ హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల పార్టీ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయం ప్రాంగణంలో పార్టీ జెండాను సిపిఐ ( ఎం.ఎల్ ) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కె.గోవర్థన్ జెండా ఎగురవేసి లెనిన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు. అనంతరం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ లెనిన్ పెట్టిన రోజు ఏప్రిల్ 22ను భారత ప్రజల విముక్తి కోసం ఒక విప్లవ పార్టీగా సీపీఐ ( ఎం.ఎల్ ) ఆవిర్భవించిందన్నారు. ఏప్రిల్ 22ను పార్టీ తమకు తాముగా కర్తవ్యానికి పునరంకితం చేసుకుంటు గ మ్యం వైపు అడుగు వేసుకుంటు వర్గ పోరాట సి ద్దాంతం వెలుగులో పురోగమించడానికి ఏప్రిల్ 22ను దీక్షా దినంగా పాటిస్తుందన్నారు. పెట్టుబడి దారి సిద్దాంత దోపిడి ఇక చెల్లదని, అక్టోబర్ విప్లవ ం యావత్ ప్రపంచానికి తెలియజెప్పిందన్నారు. ప్రపంచ మానవాళి విముక్తికి దిక్కూచిగా ఆనాటి రష్యన్ విప్లవం అనేక దేశాల్లో ప్రజాపోరాటాల ప్ర కంపనలు సృష్టించిందన్నారు. పేదల రాజ్యం స్థాప న సాధ్యమవుతుందని చెప్పడమే కాకుండా ఆచరణాత్మకంగా చూపించిన విప్లవ మేథావి లెనిన్ అని కొనియాడారు. సీపీఐ, సీపీఎం పార్టీలు ఎర్ర జెం డా పార్టీల పేరిట కొనసాగుతున్నప్పటికి అవి ఏనా డో విప్లవ స్వభావాన్ని కోల్పోయాయని అన్నారు.  త్రిపురలో అధికారం చేపట్టిన బిజెపి లెనిన్ విగ్రహాలను అమానుషంగా కూల్చివేసిందన్నారు. ఈ కార్యక్రమంలో న్యూడెమోక్రసీ నాయకురాలు జి.అనురాధ, ఐఎఫ్‌టీయు గ్రేటర్ అధ్యక్షుడు నరేందర్, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు పరుశరాం, అరుణోదయ రాష్ట్ర అధ్యక్షుడు వేణు, పీవోడబ్లూ గ్రేటర్ అధ్యక్షురాలు సరళ, ప్రజాపంధా పత్రిక మేనేజర్ మల్లిక్, భారతి, పీడీఎస్ యు మాజీ రాష్ట్ర అధ్యక్షుడు ఏడీ రాము, పీడీఎస్‌యు గ్రేటర్ ప్రధాన కా ర్యదర్శి పి.నాగరాజు, గణేష్, ఓయు పీడీఎస్‌యు అధ్యక్షకార్యదర్శులు లోకేష్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments