Home జాతీయ వార్తలు చివరి విడతలో ఓటేసిన ప్రముఖులు…

చివరి విడతలో ఓటేసిన ప్రముఖులు…

Loksabha Electionsఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల చివరిదశ పోలింగ్ ఆదివారం కొనసాగుతోంది. పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్  గోరఖ్‌పూర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీహార్ సిఎం నితీశ్ కుమార్, డిప్యూటీ సిఎం సుశీల్ కుమార్ మోడీ తదితరులు పాట్నాలోని రాజ్ భవన్ పరిధిలో ఉన్న పోలింగ్ కేంద్రంలో ఓటేశారు. టీమిండియా  క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌  పంజాబ్‌లోని జలంధర్ జిల్లా పరిథిలోని గార్హి గ్రామంలోని పోలింగ్ కేంద్రంలో ఓటేశారు. కేంద్ర మంత్రి, బిజెపి నేత రవిశంకర్‌ ప్రసాద్ తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి పాట్నా మహిళా కళాశాలో ఓటేశారు. తుది విడుత ఎన్నికల్లో ఓటేసేందుకు ప్రజలు ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.

Celebrities Cast Vote in Final Polling Loksabha Elections