హైదరాబాద్ : మాజీ లోక్సభ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ మృతిపై పలువురు సంతాపం తెలిపారు. తెలంగాణ సిఎం కెసిఆర్, ఎపి సిఎం చంద్రబాబునాయుడు, వైసిపి చీఫ్ జగన్, టిజెఎస్ చీఫ్ కోదండరాం తదితరులు సోమనాథ్ మృతిపై సంతాపం తెలిపారు. కమ్యూనిస్టుగా, ప్రజా ప్రతినిధిగా ఆయన దేశానికి చేసిన సేవలను వారు కొనియాడారు. దేశ రాజకీయాల్లో సోమనాథ్ మృతి తీరని లోటని వారు పేర్కొన్నారు.