Home తాజా వార్తలు బాపూ ఘాట్‌లో ప్రముఖుల నివాళులు

బాపూ ఘాట్‌లో ప్రముఖుల నివాళులు

Gandhijiహైదరాబాద్ : జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని పురష్కరించుకుని లంగర్‌హౌజ్‌లోని బాపూఘాట్‌లో పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. బాపూఘాట్‌లోని మహాత్ముని విగ్రహం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచిన నివాళులు అర్పించారు. గవర్నర్ నరసింహన్, తెలంగాణ సిఎం కెసిఆర్, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు కడియం శ్రీహరి, నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, సిటీ పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి, జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్ధన్‌రెడ్డి తదితరులు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు.