Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

‘సెల్’ దోపిడీ!

cell-phones

పినపాక: నేటి నిత్య జీవితంలో సెల్‌ఫోన్ లేకుండా ఏ పనీ చేయలేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితులను అదునుగా తీసుకున్న సెల్‌షాప్ షాపులు, సెల్‌షాప్ షోరూంల నిర్వాహకులు వినియోగదారులను నిత్యం నిలువుదోపి డీకి గురిచేస్తున్నారు. పినపాక, కరకగూడెం, మణుగూరు ప్రాంతాల్లోఎటువంటి నియమ నిబంధనలు లేకుండానే సెల్‌షాపులు పుట్టుకొస్తు న్నాయి. వినియోగదారుడు సెల్‌ఫోన్ రిపేర్ వచ్చిందని షాపుకు వెళ్తే నిర్వాహకులకు పండగే. ఎందుకు అంటారా… శ్యాంసంగ్ స్క్రీన్ టచ్ పోయిందనుకోండి…వాస్తవానికి దాని విలువ రూ.1000 నుంచి 1200 ఉంటుంది. కానీ షాపు నిర్వాహకులు దానిని ముందు విప్పిచూసిన తర్వాత చెబుతామంటూ రెండు రోజులు వినియోగదారులను తిప్పించు కుంటారు. బాబూ ఫోన్ అంతా పాడైపోయింది. దీనికి చాలా రిపేర్ చేయాల్సి ఉంటుంది. కనీసం రూ. 2000 నుంచి2500ల వరకు ఖర్చవుతుందనిచెబుతారు. షాక్‌కు గురైన వినియోగ దారుడు కోలుకుని… చూడండి సార్..! అంటే నేను కాబట్టి ఇలా అడుగుతున్నాను… మరే వేరే షాపునకు వెళ్తే ఇంకా ఎక్కువ మొత్తంలో చెబుతారు తర్వాత నీఇష్టం అంటారు. అయ్యో అనుకున్న వినియోగదారుడు చేసేది ఏమీ లేక ఫోన్ రిపేర్ చేయించుకుని వారు అడిగిన మొత్తాన్ని ఇచ్చి బాధపడుతూ వెనుదిరుగుతారు.

ఇదే రీతిలో అనేక మంది అమాయక ప్రజానీకం నుంచి రోజూ వారి నిలువుదోపిడీ చేస్తూనే ఉన్నారు. అదేవిధంగా ఎటువంటి గ్యారెంటీ లేని సెల్‌ఫో
న్లు, బ్యాటరీలు, చైనా చార్జర్లు, అమ్ముతున్నారు నిర్వాహకులు. నిజానికి ఒక బ్యాటరీ విలువ రూ.100 ఉంటే దానిని రూ.300 నుంచి 400 వరకూ, నాన్ బ్రాండ్ సెల్‌ఫోన్ రూ.700 ఉంటే రూ.1200 నుంచి 1500 వరకూ, ఛార్జర్, ట్రావెలింగ్ చార్జీలు రూ. 70 నుంచి 150 వరకూ ఉంటుంది. కానీ
వాటిని రూ.300 నుంచి 400 వరకూ విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో షాపుల నిర్వాహకులు రోజూవారి పెద్ద మొత్తంలో అక్రమంగా సంపాదిస్తున్నారు. వినియో గారుడు నెత్తీనోరు కొట్టుకుంటూ ఇవెక్కడి రేట్లయ్య బాబూ అంటున్నప్పటికీ వారి మాటలను లెక్కచేయని షాపుల నిర్వాహ కులు యథావిధిగా అమ్మకాలు సాగి స్తున్నానే ఉన్నారు. ఇంతజరుగుతు న్నప్పటికీ సంబంధిత శాఖా అధికారులు షాపులపై ఎటువంటి చర్యలు తీసుకున్న దాఖలాలు నేటివరకూ లేవు

Comments

comments