Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపిన కో ఆర్డినేటర్లు

Cell tower and coordinators protesting

చందుర్తి: చందుర్తి మండల కేంద్రంలో న్యాయమైన డిమాండ్‌లను పరిష్కరించాలని చేస్తున్న దీక్ష సోమవారానికి 22వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా సాక్షర భారత్ కోఆర్డినేటర్లు మండల పరిషత్ ఆవరణలో ఉన్న సెల్‌ టవర్‌లు ఎక్కి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొండి వైఖరి వీడి తమకు న్యాయం చేయాలని లేదంటే రానున్న రోజుల్లో పెద్దెత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో మండల సమన్వయకర్త అంబటి శ్రీకాంత్, సంపూర్ణ, విద్యాభారతి, జ్యోతి, సంతోష, కావ్య, పావనితో పాటు ఆయా గ్రామాల సమన్వయకర్తలు పాల్గొన్నారు.

Comments

comments