Home ఆఫ్ బీట్ ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు గ్రీన్‌టీతో చెక్..!

ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు గ్రీన్‌టీతో చెక్..!

Cells that cause lung cancer can be Avoided with Green tea

ప్రతి ఒక్కరికీ టీ తాగే అలవాటు ఉంటుంది. అందులో గ్రీన్ టీ తాగడం వల్ల పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. గ్రీన్ టీ లో యాంటీఆక్సిడెంట్లు, కార్బోహైడ్రేట్, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. విటమిన్ ఎ,బి,సి,ఇ,కె కాపర్, ఐరన్, జింక్, మాంగనీస్ లభిస్తాయి. గ్రీన్ టీలో లభించే పాలీఫినాల్స్, అమైనో ఆమ్లాలు, విటమిన్లు ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు కారణమయ్యే కణాలను 80 శాతం నివారిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. ఇందుకోసం అధ్యయనకారులు ఆకుల్లోని ఔషధాలను నానోపార్టికల్స్ రూపంలో సేకరించి క్యాన్సర్‌కణాల మీద ప్రయోగించి చూడగా, క్యాన్సర్ కణజాలం దాదాపు చనిపోయిన సంగతిని గుర్తించారు. పైగా గ్రీన్‌టీ తీసుకోవడం వల్ల ఎలాంటి దుష్ఫలితాలూ తలెత్తవని పరిశోధకులు చెబుతున్నారు.

Cells that cause lung cancer can be Avoided with Green tea

Telangana Latest News