Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

కాటి జాగా కబ్జా…?

ఏకంగా దున్నేసారు
బయట పడ్డ అస్థికలు
ఎకరంన్నర జాగా కబ్జాకు ప్రయత్నం
దళితుల్లో ఆందోళన
అడ్డుకునేందుకు సన్నాహాలు
నోరుమెదపని నేతలు

Cemetery

బాన్సువాడ డివిజన్ : అసైన్డ్‌మెంట్ జాగాలంటే అంత అలుసై పోయింది. ఖాళీ కనిపిస్తే చాలు కబ్జా చేసుకునే ఆశ పుడుతోంది. అది మంచిదైనా…చెడుదైనా సరే వారికి డోంట్‌కేర్…పొలాలు కబ్జా చేసుకోవచ్చు. ప్లాట్లు కబ్జా చేసుకోవచ్చు. కాని చివరికి మనిషికి మిగిలేది ఆరడుగుల జాగను కూడా వదిలిపెట్టకుండా కబ్జా చేసుకునే భూ భకాసురులు ఉన్నారు. అందుకు నిదర్శణం బాన్సువాడ పట్టణానికి సమీపంలోమంజీరా సరిహద్ధు ప్రాంతంలో ఉన్న దళిత వాడకు చెందిన వైకుంఠధామమే.

ఒ భూ భకాసురుడు ఈ ప్రాంతంపై కన్నేసి ఈ స్థలాన్ని కబ్జా చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. అందులో బాగంగా ఎవరికీ తెలియకుండా ఈ ప్రాంతంలో భూమిని సాగు చేసుకునే విదంగా పనులు చేపట్టారు. చాలా ఏళ్లుగా ఈ ప్రాంతంలో దళిత వర్గానికి చెందిన మృత దేహాలను ఇక్కడ అంత్యక్రియలు జరుపడం జరగుతోంది. పాత కాలం నుండి వస్తున్న ఆచారాన్ని నేటికి ఇప్పటి వ్యక్తులు అనుసరిస్తూవస్తున్నారు. కాని కొన్ని రోజుల క్రితం స్థానిక అంగధనబలమున్న వ్యక్తులు ఈ ప్రాంతంపై కన్నేసారు.

గుట్టుచప్పుడు కాకుండా ఏకంగా ప్రోక్లైనర్లను పెట్టి దున్నేసారు. వారి నిర్వాకంలో గతంలో పాతిపెట్టిన మృత దేహాల అస్థికలు బయటపడ్డాయి. రాతి పలాకాలతో నిర్మించిన సమాదులను సైతం కూల్చేశారు. దాదాపు ఎకరంన్నర విస్తీర్ణం గల జాగాను కబ్జా చేసుకునేందుకు భూ కబ్జాదారులు ప్రయత్నాలు చేశారు. వాస్తవానికి అది అసైన్డ్‌భూమియే. అప్పట్లో దళిత వర్గం వారికి స్మశాన వాటికగా అంత్యక్రియలు నిర్వర్తించుకునేందుకు అధికారికంగా అట్టి జాగాను అప్పగించారు. కాని స్మశాన వాటిక కింద మంజూరు చేసే అవకాశం లేక పోవడంతో అలాగే ఉండి పోయింది. అట్టి స్థలం పక్కనే ఇటీవల మంత్రి పోచారం ఈ స్మశాన వాటిక చుట్టు ప్రక్కల ప్రహారీ గోడను నిర్మించుకునేందుకు నిధులు కెటాయించి భూమిపూజ కూడా జరిపించారు. ఈ ప్రాంతంలో స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తులెవరన్నది వెలుగులోకి రావడం లేదు.

ఈ విషయాన్ని పలువురు దళిత నాయకులు గ్రామ పెద్దల దృష్టికి తీసుకుపోయినప్పటికీ వారి నుండి కూడా ఏలాంటి స్పందన కనిపించకపోవడంతో దళిత నాయకుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా దళిత స్మశాన వాటిక స్థలాన్ని కబ్జా చేయకుండా ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం రెవిన్యూ శాఖకు ఎంతైనా ఉంది.

Comments

comments