Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

లారీల సమ్మె విరమణ

center that came forward to address demands

కేంద్ర ప్రభుత్వంతో చర్చలు సఫలం

డిమాండ్ల పరిష్కారానికి ముందుకొచ్చిన కేంద్రం

మన తెలంగాణ / హైదరాబాద్ : వారం రోజులుగా కొనసాగుతున్న సమ్మెను లారీ యజమాను సంఘం శుక్రవారం నుంచి విరమించింది. సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో పాటు ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయడానికి సంసిద్ధంత వ్యక్తం చేయడంతో సమ్మెను విరమిస్తున్నట్లు అఖిల భారత మోటారు ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ ఒక ప్రకటనలో తెలియజేసింది. కేంద్ర ప్రభుత్వానికీ, మోటారు ట్రాన్స్‌పోర్టు ప్రతినిధులకు మధ్య శుక్రవారం జరిపిన సమ్మెపై ఏకాభిప్రాయం రావడంతో సమ్మెను విరమిస్తున్నట్లు ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్ అధ్యక్షుడు ఎస్‌కె మిట్టర్, ఛైర్మన్ కుల్‌తరణ్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. థర్డ్ పార్టీ ఇన్సూరెన్సుపై పునస్సమీక్ష జరపడానికి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారని, శనివారం మధ్యాహ్నం దీనిపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. టోల్‌గేటు రుసుము చెల్లింపుకు కూడా సులభతరమైన విధానాలను ప్రవేశపెట్టడానికి కేంద్రం ముందుకొచ్చిందని, ఇకపైన వాహన ఫిట్‌నెస్ సర్టిఫికెట్ కాలపరిమితిని రెండేళ్ళకు పెంచడానికి ఆమోదించిందని, డ్రైవర్లకు, క్లీనర్లకు ఇఎస్‌ఐ సౌకర్యంతో పాటు ప్రధానమంత్రి జీవన్‌జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన తదితర పథకాలను వర్తింపజేయడానికి ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని& ఇలా అనేక డిమాండ్లకు కేంద్ర రవాణాశాఖ సంయుక్త కార్యదర్శి అబే డామ్లే సమ్మతించారని తెలిపారు. టూరిస్టు వాహనాలకు సైతం జాతీయ పర్మిట్ అనుమతి మంజూరులో ఇబ్బందులు లేని విధానాన్ని తీసుకురావడానికి అంగీకరించారని తెలిపారు.

Comments

comments