Home నిజామాబాద్ ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నకేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు

ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నకేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు

rally

మనతెలంగాణ/నిజామాబాద్: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడు తున్నాయని ఎఐటియుసి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె. బోసుబాబు, వై. ఓమయ్యలు పేర్కొ న్నారు. సోమవారం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.  ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ అధిక ధరలను నియంత్రించడంతో పాటు పౌరసరఫరాల శాఖ ద్వారా అందించే 14 రకాల నిత్యవసర సరుకులను పంపిణీ చేయాలని, నగదు బదిలీని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికులకు నెలకు 18వేల వేతనం చెల్లించాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయడంతో పాటు పిఎఫ్, ఇఎస్‌ఐ, బోనస్, గ్రాడ్యూవిటి అమలు చేయడంతో పాటు 3వేల పెన్షన్ అందించాలని కోరారు. జిల్లా కేంద్రాసుపత్రి, మెడికల్ కళాశాల, బోధన్ ఏరియా ఆసుపత్రిల్లో విధులు నిర్వహిస్తున్న కార్మిక వేతన కాల పరిమితి పూర్తయినందున నూతనంగా అగ్రిమెంట్ చేసుకోవాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ విదానాన్ని రెగ్యూలర్ చేయాలని మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. కార్మిక సంఘాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ 45 రోజుల్లో పూర్తి చేయాలని కోరారు. ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేస్తున్న హమాలీలను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని వారు డిమాండ్ చేశారు. వినతిపత్రం సమర్పించిన వారిలో బాగ్యలక్ష్మి, సుధాకర్, మహబూబ్, మక్బుల్, అనిల్, కిషోర్ తదితరులున్నారు.