Search
Friday 21 September 2018
  • :
  • :

క్రీడల అభివృద్ధ్దికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులు

రాష్ట్ర స్థాయి మహిళ ఫుట్‌బాల్ పోటీలు

Games

మంచిర్యాల అర్బన్ : క్రీడల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు  నిధులు వెచ్చిస్తున్నాయని  మంచిర్యాల ఎంఎల్‌ఏ దివాకర్‌రావు  అన్నారు.  బుధవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో రాష్ట్ర స్థాయి  సీనియర్ మహిళ విభాగం ఫుట్‌బాల్ పోటీలను ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్  ఆధ్వర్యంలో  ప్రారంభమయ్యాయి. ఎంఎల్‌ఏతో పాటు మంచిర్యాల డిసిపి జాన్‌వెస్లీ, మున్సిపల్ చైర్‌పర్సన్ మామిడిశెట్టి వసుంధర, ఫుట్‌బాల్ అసోసియేషన్  జిల్లా  అధ్యక్షుడు  పురుషోత్తంరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి,  క్రీడాపతకాలను  ఎగురవేసి పోటీలను ప్రారంభించారు.

అంతకు ముందు మృతి చెందిన  ఫుట్ బాల్ క్రీడాకారులైన  రాధాకృష్ణ, శ్రీనివాస్‌లకు  మైదానంలో  రెండు నిమిషాలు మౌనం పాటించి,  నివాళులర్పిచారు. ఎంఎల్‌ఏ మాట్లాడుతూ  క్రీడాకారులకు మంచిర్యాల నిలయమని,ఈ ప్రాంతంలో ఆట గాళ్లకు కొదువలేదన్నారు. చదువుతో పాటు క్రీడల్లో కూడా తప్పని సరిగా ఉండాలన్నారు.

ఆటల్లో ప్రతిభ కనబర్చిన వారికి  అనేక ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని క్రీడల కోటాను  2 నుండి 3 శాతం పెంచుటకు తమ ప్రభుత్వం కృషి చేస్తుం దన్నారు.  క్రీడలపై ఆసక్తి, ఉత్సాహం ఉంటేనే  గెలుపు సాధ్య మవుతుందన్నారు. డిఒ డాక్టర్ కె . ర వికాంత్, ఫుట్‌బాల్ రాష్ట్ర కార్య దర్శి పాల్గున, భూపాలపల్లి డిఎస్‌పి శ్రీనివాస్, సిఐ సుధాకర్, మున్సిపల్ వైస్‌చైర్మన్ నల్లశంకర్,  ఏఎంఏ ప్రత్యూష, ఎంఇఓ ప్రభాకర్‌రావు, కౌన్సిలర్లు పడాల రామన్న, షఫీ, జగన్మోహన్‌రావు, ఎంఇఓ పారువెల్లి ప్రభాకర్‌రావు, వివిధ క్రీడాకారుల అధ్యక్షులు పాల్గొన్నారు.

Comments

comments