Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

బాలకృష్ణ డబ్బుల పంపిణీపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్..

bala

న్యూఢిల్లీ: ఎపి సిఎం చంద్రబాబు నాయుడు వియ్యంకుడు, హిందూపూర్ ఎంఎల్ఎ బాలకృష్ణ నంద్యాల ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా రోడ్ షోలో డబ్బుల పంపిణీపై కేంద్ర ఎన్నికల సంఘం అగ్రహం వ్యక్తం చేసింది. మరోసారి ఘటనపై విచారణ జరిపి నివేదిక పంపించాలని జిల్లా కలెక్టర్ కు ఆదేశించింది. తమ ప్రభుత్వం అనేక అభివృద్ధి పనులు చేస్తోందని, నంద్యాల బాగుపడాలంటే టిడిపికి ఓటేయాలని ప్రజలను కోరారు. అదే సమయంలో మంత్రి అఖిల ప్రియ రోడ్ షోలో ప్రసంగిస్తుండగా ఆమెకు వెనుక వైపు బాలకృష్ణ ఓటర్లకు డబ్బులు పంచుతూ కెమెరాకు చెక్కారు. రాష్ట్ర మంత్రి అఖిల ప్రియ సాక్షిగా ఎంఎల్ఎ బాలకృష్ణ తన ఎడమ చేతిలో డబ్బుల కట్ట పట్టుకుని కుడిచేత్తో ఓటర్లకు డబ్బులు పంచుతున్న దృశ్యాన్ని కొందరు కెమెరాలో బంధించారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.
ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం మళ్లీ రిపోర్టు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించింది. మరోవైపు సర్వేలను నిలిపే అధికారం సిఇసికి ఉందని తెలిపింది. ఎన్నికల నిర్వహణలో అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా హెచ్చరించింది.

Central Election Commission is very serious about Balakrishna’s money supply

Comments

comments