Search
Thursday 15 November 2018
  • :
  • :

టిడిపికి కేంద్ర ఎన్నికల సంఘం ఝలక్?

TDP

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. ఆగస్టు 23న ఇక్కడ ఉప ఎన్నిక జరగనుంది. నంద్యాల ఉప ఎన్నికను దృష్టిలో ఉంచుకుని అధికార టిడిపి కొత్త ఓటర్లను చేర్పించింది. అయితే జనవరి 1, 2017 వరకూ ఓటర్ల జాబితాలో ఉన్న వారికే ఓటు హక్కు కలిపిస్తున్నట్టు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. తాజా ఓటర్ల చేరికను లెక్కలోకి తీసుకోమని ఇసి తేల్చి చెప్పింది. ఈ క్రమంలో టిడిపి ఇటీవల కొత్తగా చేర్పించిన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే వీల్లేకుండా పోవడంతో టిడిపి ఖంగుతింది.

నంద్యాలలో జనవరి 1 వరకు సుమారు రెండు లక్షల తొమ్మిది వేల ఓటర్లు ఉన్నారు. ఇదిలా ఉండగా అధికార టిడిపి తరపున భూమా బ్రహ్మానందరెడ్డి, వైఎస్‌ఆర్‌సిపి తరపున శిల్పా మోహన్‌రెడ్డిలు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతితో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. వైఎస్‌ఆర్‌సిపి నుంచి గెలిచిన భూమా నాగిరెడ్డి అనంతరం అధికార టిడిపిలో చేరారు. ఈ క్రమలో ఆయన ఇటీవల గుండెపోటతో చనిపోయారు.

అయితే ఇక్కడ ఉప ఎన్నికను ఏకగ్రీవం చేయాలని అధికార టిడిపి ప్రయత్నించింది. ఇందుకు వైఎస్‌ఆర్‌సిపి అంగీకరించలేదు. ఈ స్థానం తమదేనని, అందుకే పోటీలో ఉన్నామని, ఈ ఎన్నికల్లో విజయం తమదేనని వైఎస్‌ఆర్‌సిపి వర్గాలు చెబుతున్నాయి. ఇక్కడ గెలుపోటములు నిర్ణయించేది మైనార్టీలే. నంద్యాల నియోజకవర్గంలో 50 వేల మైనార్టీ ఓట్లు ఉన్నాయి. టిడిపిపై మైనార్టీలు అంతగా ఆసక్తి చూపించడం లేదని, వైఎస్‌ఆర్‌సిపి వైపే మైనార్టీలు మొగ్గు చూపుతున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రమంలో వైఎస్‌ఆర్‌సిపి గెలుపు నల్లేరు మీద నడకే కావచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Central Election Commission Orders : Shock to TDP

Comments

comments