Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

సమస్య తలెత్తితే.. వాట్సప్, ఫేస్‌బుక్‌లకు చరమగీతం ?

central government asks telecom operators to find ways to block WhatsApp and Face Book

న్యూఢిల్లీ: ప్రస్తుతం ఇప్పుడున్న యూత్ అందరు సామాజిక మాధ్యమాల్లో చాల చురుగ్గ ఉంటున్నారు. అయితే సోషల్ మీడియా రెండువైపులా పదునున్న కత్తి లాంటిదని నిఫుణులు అంటున్నారు. సోషల్ మీడియాతో సమాజంలో చైతన్యం కలిగించొచ్చు, కట్టుకథలతో ప్రళయం సృష్టించవచ్చు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో భాగమైన వాట్సప్ ద్వారా బూటకపు వదంతుల కారణంగా మూకుమ్మడిగా జరుగుతున్నదాడుల్లో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న సంగతి తెలిసిందే. అయితే తాజగా ఫేస్‌బుక్‌లోనూ ఇటువంటి సమస్యలే తలెత్తుతున్నాయి. ముఖ్యంగా కశ్మీర్‌లాంటి సమస్యల్లో సోషల్ మీడియాలు హింసను ఎగదోసే పాత్రను ప్రధానంగా పోషిస్తున్నాయి. అందుకే అత్యవసర పరిస్థితుల్లో వాట్సప్, ఫేస్‌బుక్‌లను బ్లాక్ చేసే మార్గం ఏదైనా ఉందా…? అని కేంద్ర ప్రభుత్వం టెలికం ఆపరేటర్లను ప్రశ్నించింది. ఇటీవల ప్రభుత్వం ఆపరేటర్లకు రాసిన లేఖను రాయిటర్స్ వార్తాసంస్థ సేకరించింది. దేశంలో అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు ఇన్‌స్టాగ్రాం, ఫేస్‌బుక్, వాట్సప్, టెలిగ్రాం వంటి యాప్స్‌ను బ్లాక్ చేసే మార్గాలను అన్వేషించాల్సిందిగా ఆ లేఖలో కేంద్రం పేర్కొంది. జాతీయ భద్రతను కాపాడడానికి ఇటువంటి చర్యలు తీసుకోక తప్పదంటున్నారు అధికారులు.

Comments

comments