Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

కొత్త సంఖ్య విధానంతో నకిలీ కరెన్సీకి చెక్

తొలుత రూ.1000, రూ.500 నోట్లకు

Fake notes_manatelanganaన్యూఢిల్లీ: నకిలీ నోట్లకు చెక్ పెట్టేందుకు ప్రభు త్వం సరికొత్త విధానాన్ని ప్రవేశపెడుతోంది. కరెన్సీ నోట్లలో కొత్తగా సంఖ్యా విధానాన్ని తీసుకురానుంది. ప్రత్యేకించి అధిక విలువ కల్గిన రూ.1000, రూ.500 నోట్లలో ఈ విధానం అమలు చేసి నకిలీ కరెన్సీని ని యంత్రించాలని ఆర్‌బిఐ(భారతీయ రిజ ర్వు బ్యాంక్) భావిస్తోంది. సంఖ్య నమూ నా సవరణను ప్రవేశపెట్టేందుకు గాను భారతీయ రిజర్వు బ్యాంక్ నోట్ ముద్రన్ ప్రైవేటు లిమిటెడ్(బిఆర్‌బిఎన్‌ఎంపిఎల్), సె క్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆ ఫ్ ఇండియా(ఎస్‌పిఎంసిఐఎల్)లు తగిన చర్యలు చేపడు తున్నాయి. తొలుత ఈ నంబరింగ్ విధానాన్ని రూ.1000, రూ.500 కరెన్సీ నోట్లకు వచ్చే ఏడాది మే నాటికి ప్రారంభించ నున్నారు. దీంతో పాటు ఏడు సెక్యూరిటీ ఫీచర్లను ప్రభుత్వం ఆ మోదించింది, అయితే వీటి వివరాలను వెల్లడించ లేదని అధికార వర్గాలు వెల్లడించాయి. నకిలీ నోట్లను గుర్తిస్తే కౌంటర్‌ఫీట్ నోట్‌గా ముద్రవేసి, వాటిని వెంటనే స్వాధీనం చేసుకోవాలని ఆర్‌బిఐ బ్యాంకులకు సూచిస్తోంది. దేశంలో నకిలీ నోట్లు రూ.30 కోట్ల వరకు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఎఫ్‌ఐసిఎన్ (నకిలీ భారతీయ కరెన్సీ నోట్) కేసు ల కోసం ఎన్‌ఐఎ(జాతీయ విచారణ సంస్థ) ఒక నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చే సింది. పాకిస్తాన్ ఐఎస్‌ఐ నకిలీ నోట్ల ను భారత్‌లోకి జొప్పిస్తుందని ఎన్నోసార్లు రుజు వైంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ దేశాల సరిహ ద్దుల నుంచి నకిలీ కరెన్సీ నోట్ల వరద పారుతోంది. వీటికి చెక్ పెట్టాలని ప్రభుత్వం ఈ సరికొత్త విధానాన్ని ప్రవేశపెడుతోంది.

Comments

comments