Home జాతీయ వార్తలు తమిళనాడుకు కేంద్రం హెచ్చరిక!

తమిళనాడుకు కేంద్రం హెచ్చరిక!

Central Govt warns Tamil nadu Govt about Cauvery floods

న్యూఢిల్లీ: పొరుగు రాష్ట్రాలు కేరళ, కర్నాటకల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాల నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వానికి కేంద్రం హెచ్చరించింది. ఈ రెండు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కావేరి పరివాహక ప్రాంతాలైన ఆరు జిల్లాలకు వరద ముప్పు పొంచి ఉందని కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు సెంట్రల్ వాటర్ కమిషన్, తమిళనాడు ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది. ఈ నేపథ్యం ముందస్తుగా తగు చర్యలు తీసుకోవాలని తమిళనాడు అధికారులను కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దీంతో వెంటనే అప్రమత్తమైన తమిళనాడు సర్కార్ చర్యలు చేపట్టి ఆరు జిల్లాలోని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరించేందుకు ఏర్పాట్లు చేసింది. భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న కేరళ రాష్ట్రానికి తమిళనాడు రూ.5కోట్ల ఆర్థిక సహయం ప్రకటించిన సంగతి తెలిసిందే.