Home తాజా వార్తలు కేంద్ర బృందం భగీరథ యాత్ర…

కేంద్ర బృందం భగీరథ యాత్ర…

 Bhagiratha Yatra

 

మూడు రోజుల పాటు మిషన్ భగీరథ క్షేత్రస్థాయి పరిశీలనకు నేడు రానున్న కేంద్ర బృందం

హైదరాబాద్: మిషన్ భగీరథ ప్రాజెక్టు క్షేత్రస్థాయి పరిశీలనకు నేడు కేంద్ర బృందం రానుంది. దేశంలోని తాగునీటి సరఫరా పథకాల పనితీరు, తీరుతెన్నులను పరిశీలించేందుకు కేంద్ర తాగునీటి విభాగంలోని అధికారులు వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా కేంద్ర తాగునీటి విభాగం డిఫ్యూటీ సలహాదారుడు డి.రాజశేఖర్ నేతృత్వంలో అధికారుల బృందం మూడురోజుల పాటు తెలంగాణలో పర్యటించనుంది. నేడు ఎల్లూరులోని ఇంటెక్‌వెల్ వాటర్‌ట్రీట్ మెంట్ ప్లాంట్‌తో పాటు భగీరథ నీరు సరఫరా అవుతున్న గ్రామాల్లోని వాస్తవ పరిస్థితులను తెలుసుకుంటుంది. గురువారం గజ్వేల్ కోమటిబండ, సిద్ధిపేట గ్రామాల్లో ఈ బృందం పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా అక్కడి ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను తెలుసుకుంటుంది. శుక్రవారం ఎర్రమంజిల్‌లోని మిషన్ భగీరథ ప్రధాన కార్యాలయం లో అధికారులతో కేంద్ర బృందం సమావేశం కానుంది. గతంలో పలు రాష్ట్రాల అధికారుల బృందం మిషన్ భగీరథ ప్రాజెక్టును పరిశీలించిన విషయం తెలిసిందే.

Central Team Bhagiratha Yatra