Home జాతీయ వార్తలు కొనసాగుతున్న భారత్ బంద్

కొనసాగుతున్న భారత్ బంద్

BANDH

ఢిల్లీ : మతపరమైన రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ కొన్ని సంస్థలు మంగళవారం భారత్ బంద్ నిర్వహిస్తున్నాయి. బంద్ నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని కేంద్ర హోంశాఖ ఆయా రాష్ట్రాలను ఆదేశించింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, బిహార్, యుపి తదితర రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. బిహార్‌లోని ఆర్రాలో ఆందోళనకారులు రైలును నిలిపివేశారు. పోలీసులు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. విద్యా, ఉద్యోగాల్లో మతపరమైన రిజర్వేషన్లు వద్దంటూ బిహార్‌లో ఆందోళనకారులు నిరసన ర్యాలీ తీశారు.

Centre asks states to tighten security for Bharat Bandh today