Search
Thursday 18 October 2018
  • :
  • :

రోహింగ్యాలకు ఓటరు కార్డులు

CEO office has been deleted by voter cards for royalty

గుర్తించి తొలగించిన సిఇఒ కార్యాలయం

మన తెలంగాణ/హైదరాబాద్: ముస్లింలలో ప్రత్యేక తెగకు చెందిన రోహింగ్యాలు రాష్ట్రంలో అక్రమంగా ఓటరు గుర్తింపు కార్డులు (ఇపి ఐసి) పొందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయానికి అందిన ఫిర్యాదులకు అనుగుణంగా క్షేత్రస్థాయి పరిశీలన ప్రారంభమైంది. కొద్దిమంది రోహింగ్యాలకు ఓటరు గుర్తింపు కార్డులు అందినట్లు అధికారులు గుర్తిం చారు. మయన్మార్ నుంచి మన దేశానికి శరణార్థులుగా వచ్చిన వేలాది మంది రోహింగ్యాలు మూడేళ్ళుగా నగరంలోని బాలాపూర్ తదితర ప్రాంతాల్లో నివసిస్తు న్నారు. వారికి ఐక్యరాజ్య సమితి నుంచి ‘శరణార్ధి’ గుర్తింపు కార్డులు ఉన్నప్పటికీ కొన్ని అవసరాల కోసం మన దేశానికి చెందిన ఏదేని ఒక గుర్తింపు కార్డు కోసం ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. అందులో భాగమే రకరకాల మార్గాల్లో ప్రయత్నించి ఇప్పుడు ఓటరు గుర్తింపుకార్డు  పొందడం. ఇటీవల చేపట్టిన ముసాయిదా ఓటర్ల జాబితా సవరణలో భాగంగా ఓటు హక్కు కోసం నమోదు చేసుకున్న వివరాలను పరిశీలిస్తున్న క్రమంలో ఈ విషయం బైటపడింది.

రెండు, మూడు నియోజకవర్గాల్లో రోహింగ్యాలు ఓటు హక్కు కోసం పేరును నమోదు చేసుకోగా అధికారులు కూడా ఆమోదం తెలిపినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయానికి ఫిర్యాదు అందింది. దీనిపై రహస్యంగా విచారణ చేపట్టిన సిఇఒ సంబంధిత నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులను అప్రమత్తం చేసి, క్షేత్రస్థాయి పరిశీలన నివేదికను తెప్పించుకున్నారు. రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో అక్రమంగా రోహింగ్యాలు ఓటు హక్కును పొందారని ఆ జిల్లా ఎన్నికల అధికారి గుర్తించి, రాష్ట్ర సిఇఒకు నివేదికను అందించారు. దీని ప్రకారం మహేశ్వరం నియోజకవర్గంలో దాదాపు 37 మంది శరణార్థ రోహింగ్యాల ఓటరు గుర్తింపు కార్డులను గుర్తించి తొలగించినట్లు ఆ నివేదికలో పేర్కొన్నారు. అలాగే రాజేంద్రనగర్ నియోజకవర్గంలో కూడా ఏడుగురు రోహింగ్యాల ఓటరు గుర్తింపు కార్డులు (ఇపిఐసి)లు తొలగించినట్లు వివరించారు. రాజేంద్రనగర్‌లో మహమ్మద్ ఇనాయతుల్లా (ఇపిఐసి నెంబర్ డబ్లుపికె 1678806), రిజాన్ బేగం (డబ్లుపికె 1678772), ఎమ్.డి అబ్దుల్లా (డబ్లుపికె1826264), అలీ హుస్సేన్ (డబ్లుపికె 3297570), నూర్ నహర్ (డబ్లుపికె 2065044), శంశూ అలం (డబ్లుపికె 1682532), ఎమ్.డి అల్యోబ్ (డబ్లుపికె 3356359) శరణార్థుల రోహింగ్యాల ఓటరు గుర్తింపు కార్డులన్నింటిని తొలగించినట్లు నివేదికలో వివరించారు.

ఇక మహేశ్వరం నియోజకవర్గానికి వస్తే మొత్తం 189 రోహింగ్యాల పేర్లను గుర్తించామని అందులో 147 మందికి ఓటరు గుర్తింపు కార్డు నెంబర్‌లు కలిగి ఉన్నారని, మిగతా 42 మందికి ఇపిఐసి నెంబర్‌లు లేవని కలెక్టర్ సిఇఒకు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. ఇందులో 64 మందివి మహేశ్వరం నియోజకవర్గానికి సంబంధించి ఉన్నాయని, ఇందులో ఎలక్ట్రోరల్‌లో వచ్చిన 37 మంది ఇపిఐసిలను తొలగించినట్లు వివరించారు. మిగతా 27 ఓటర్ల జాబితాలో లేనట్లు ధ్రువీకరించారు. దాదాపు 5 వేల మంది శరణార్థ రోహింగ్యాలు బాలాపూర్ ప్రాంతంలో ఆశ్రయం పొందుతున్నారు. అక్కడ బిస్మిల్లా కాలనీ, రాయల్ కాలనీ, క్యూబా కాలనీ వంటి ప్రాంతాల్లో ఉన్నట్లు నివేదించారు. శరణార్థులుగా వచ్చిన రోహింగ్యాల పేర్లతో కూడా జాబితాను బూత్ స్థాయి అధికారులకు, సంబంధిత పోలీసు కమిషనరేట్‌తో పాటు వాటి పరిధిలోని పోలీస్ స్టేషన్‌లకు కూడా అందించినట్లు పేర్కొన్నారు. ఇదే విషయమై సిఇఒ ఉన్నతాధికారులను సంప్రదించగా రోహింగ్యాలు కొంతమంది ఓటరు గుర్తింపు కార్డుల నెంబర్‌లు పొందిన మాట వాస్తవమేనని, వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి తొలగించినట్లు వారు వివరించారు.

CEO office has been deleted by voter cards for royalty

Comments

comments