Home తాజా వార్తలు నవ్వులు తెప్పిస్తున్న కోహ్లీ, చాహల్ డ్యాన్స్

నవ్వులు తెప్పిస్తున్న కోహ్లీ, చాహల్ డ్యాన్స్

Virat-Kohli-and-Chahal

బెంగళూరు: ఐపిఎల్ ప్రారంభం ఇంకా రెండు రోజులు ఉండటంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండాపోతుంది. యుజేంద్ర చాహల్ ఒక వీడియో తన ట్విట్టర్ లో పోస్టు చేయడంతో వేలాది మంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికే స్వదేశీ, వీదేశీ ఆటగాళ్లు కసరత్తులు చేస్తున్నారు. తన జట్టు ఆటగాళ్లతో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు ఒక ప్రొమోను విడుదల చేసింది. చాహల్, బ్రెండన్ మెకల్లమ్, విరాట్ కోహ్లీతో డ్యాన్స్ చేయించింది. స్టెప్పులేస్తున్నప్పుడు మధ్యలో చాహల్ నవ్వుతూ ముందుకు కదిలాడు. చాహల్‌ను చూసి విరాట్ ఒక్కసారిగా నవ్వడంతో అక్కడ ఉన్నవారంతా నవ్వారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆటగాళ్ల డ్యాన్స్‌ను చూసి నెటిజన్లు నవ్వు ఆపుకోలేకపోతున్నారు. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా రాయల్స్ చాలెంజర్ ఐపిఎల్ ట్రోఫీని అందుకోలేకపోయింది. ఈ సారైనా అందుకుంటుందో లేదో వేచిచూడాలి. ఆర్‌సిబి తన మొదటి మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్ తో ఆడనుంది.