Home కరీంనగర్ క్షణాల్లోనే గొలుసులు మాయం.

క్షణాల్లోనే గొలుసులు మాయం.

  • ద్విచక్రవాహనలపై వస్తూ తెగిస్తున్న యువకులు.
  • రెచ్చిపోతున్న చైన్ స్నాచర్లు.
  • నిద్దరోతున్న కరీంనగర్ జిల్లా పోలీసులు.
  • దొంగతనలకు పాల్పడుతున్న వారిలో ఎక్కువగా యువత, స్టూడెంట్స్ , అంతర్ రాష్ట్ర ముఠాలే.

karimnagar-2గుడు..గుడు చప్పుడు విన్పిస్తే గుండె ఆగినంత పనవుతోంది. వెనుక వైపు నుంచి బైక్ ఏ మాత్రం వేగంగా వచ్చిన అదిరిపడే పరిస్థితి. వీధి చివరన ఒకరి కన్నా ఎక్కువ మంది యువకులు మాట్లాడుకుంటున్నా..అడుగు ధైర్యంగా ముందుకేయలేని దుస్థితి. కనీసం బంగారు తాళితో బయటకెళ్లినా అతివకు రక్షణ కరువైంది. బండి మీద రయ్..అని వచ్చి చైన్లు లాక్కుని జుయ్ అని దూసుకెళ్తున్నారు. ఆడాది అర్ధరాత్రి బయట ఒంటరిగా తిరిగినప్పుడే నిజమైన స్వాత్రంత్యం అని అన్నారు…ఆ మహత్ముడు. కానీ కరీంనగర్ జిల్లా మహిళ మిట్ట మధ్యాహ్నం ఒంటరిగా తిరగలేని పరిస్థితి దాపురించింది.

కరీంనగర్ : కరీంనగర్ జిల్లా కేంద్రంలో మూడు పోలీస్ స్టేషన్లు తో పాటు రూరల్ , మహిళ, సిసిఎస్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. నగరంలో మొత్తం 58 డివిజన్లు..ఈ డివిజన్లలో ప్రతి నెల రోజుల వ్యవధిలో రెండు నుంచి ఐదువరకు చైన్ స్నాచింగ్ లు జరుగుతున్నాయి. ఒంటరిగా మహిళలు బయటకు గాని, ఫంక్షన్లకి గాని, పిల్లలను స్కూల్ తీసుకెళ్లాడం, మార్కెట్ , దేవాలయలకు వెళ్లడం, సూపర్ మార్కెట్ , అదే విధంగా ఉదయం ఇంటి ముందు వాకిలి ఉడుస్తున్న సమయంలో చైన్ స్నాచర్స్ తమ చేతి వాటం చూపిస్తున్నారు. మహిళలు ఫంక్షన్లకు గాని ప్రయాణాలు చేస్తున్నరంటే వారు ఇంట్లో నుంచి ఎన్ని ఆభరణాలు ధరించి వెళ్తున్నారో మళ్లీ తిరిగి ఇంటికి వచ్చే సరికి ఒంటి పై అవి ఉండటం లేదు. వీధి చివరణ ఇద్దరు బైక్ ఉండి మహిళలు వస్తున్నంటే వారి మెడలొంచి బంగారు గొలుసు దొంగలించుకొని వెళ్తున్నారు. వారం వ్యవధిలో 10 చోరీలు జరిగాయి అంటే అది పోలీసుల నిఘా వైఫల్యంతో చోరులు రెచ్చిపోతున్నారు. రెప్పపాటులో చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్నారు. ఖరీదైనా బైకులు వాడుతూ పెద్దింటి బిడ్డల్లా నమ్మిస్తున్నారు. కేవలం దొంగతనల కోసమే ఖరీదైనా బైక్‌లు కొనుగోలు చేస్తున్నారంటే దొంగతానలు ఏ విధంగా జరుగుతున్నాయే అర్ధం చేసుకొవచ్చు. మరో వైపు చైన్ స్నాచర్లు దొంగతానలకు పాల్పడుతున్నరంటే..మొదటగా ఒక ఏరియాలో బైక్ దొంగలించి దానిపై మరోకాలనీ చైన్ స్నాచింగ్ పాల్పడుతున్నారు. అక్కడ బంగారు గొలుసులు దొంగలించిన అనంతరం బైక్ ను అక్కడే వదిలేసి మరో బైక్ దొంగలించి మరో కాలనీలో దొంగతానలకు పాల్పడుతున్నారు. దొంగలించిన బైక్ కు నంబర్ ప్లేట్ అలానే ఉంచి చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు. నగరంలో పలు చోట్ల సిసి కెమెరాలు ఏర్పాటు చేయ్యడంతో దొంగలు బైక్ పై పారిపోతున్న సందర్భంగా బైక్ కు సంబంధించిన నంబర్ సిసి కెమెరాలో రికార్డ్ అవడంతో అందులోని అడ్రస్‌కు వెళ్లే సరికి అది మరో వ్యక్తిది కావడం గమనర్హం. అయితే నగరంలో ఎవరిదైన బైక్ దొంగలు ఎత్తుకెళ్తే సంబంధిత పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చెయ్యాలని పోలీసులు కోరుతున్నారు. కాగా, మరోవైపు అంతర్ రాష్ట్ర దొంగలు నగరంలో బైక్ లు దొంగలించి చైన్ స్నాచింగ్ కు పాల్పడిన అనంతరం ఎత్తుకొచ్చిన బైక్‌లను కరీంనగర్ జిల్లాలో అయితే బస్టాండ్ లోని పార్కింగ్ లో పెట్టి బస్సుల్లో, లారీల్లో వెళ్లిపోతున్నారు. వరంగల్ , నిజామాబాద్ , ఆదిలాబాద్ లో దొంగతానం చేసి రైల్వే స్టేషన్ లో బైక్స్ పార్క్ చేసి వెళ్లిపోతారు. అనుమానం రాకుండా సొత్తుతో మాయమవుతున్నారు. ఎవరైనా ప్రతిఘటిస్తే దాడులకూ తెగబడుతున్నారు. వీరంతా ప్రొఫెషనల్సేం కాదు, దొంగల్లో ఉన్నతా విద్యావంతులూ , మైనర్ బాలురూ ఉండటం కలవరపరుస్తోంది.

నగరంలో చైన్ స్నాచింగ్ చేస్తున్నది స్టూడెండ్స్…?

పోలీసులు కొందరు దొంగలను అరెస్ట్ చేశారు. వీరంతా ఇంజనీరింగ్ , ఇంటర్ విద్యార్ధులే అని తెలిసి ఆశ్చర్యపోయారు. చాలా మంది ఖరీదైనా బైక్‌ల పై వచ్చి చోరీలు చేస్తున్నారు. ఇందులో జల్సాలకు అలవాటు పడిన వారే అధికం. జిల్లాలో సుమారు 120 మందిదాక దొంగలు ఉన్నారు. ఇందులో 80 శాతం మంది 22-28 ఏళ్లలోపు వారే. బంగారం ధర పెరగడంతో, ఒకరి మెడలోంచి బంగారు గోలుసు దొంగలిస్తే 50 వేల నుంచి 60 వేల వరకు నగదు రావడంతో నగల చోరి పై దృష్టిసారించారు. సులభంగా అమ్ముతు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు పొందుతున్నారు. ఎక్కువగా ఒంటరిగా బయటకు వచ్చే మహిళల పై నజర్ వేసి చోరీలకు పాల్పడుతున్నారు. చైన్ స్నాచర్లు అసలు ఎంత మంది కరీంనగర్ పట్టణంలో ఉన్నరో తెలియడం లేదు. గతంలో నగరంలో పలువురి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించన సందర్భంలో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. చైన్ స్నాచర్లు ఎక్కువ శాతం ఇంటర్ , ఇంజనీరింగ్ , డిగ్రీ స్టూడెండ్స్ అని తెలియడంతో పోలీసులు కంగుతిన్నారు. మరి అందులో పెద్దింటి సుపుత్రులు సైతం ఉన్నారు. ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్ధులు జల్సాలకు అలవాటు పడి…అమ్మాయిలు, ప్రేమ అని ఖర్చుల కోసం దొంగతానలకు పాల్పడుతున్నారు. ప్రేమించిన అమ్మాయిని సినిమాలకు , షికార్లుకు , ఖరీదైన బహుమతులు ఇచ్చేందుకు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని చెడు ఆలోచనలు విద్యార్ధులను పక్కదారి పట్టిస్తున్నాయి. అయితే చైన్ స్నాచర్ల ను పట్టుకోవడం పోలీసుల వల్ల కావడం లేదు. ఎందుకంటే ఒక ముఠా చైన్ స్నాచింగ్ కు పాల్పడుతుందటే…అందులో ఒకరు దొరికిన అందరిని అదుపులోకి తీసుకోవచ్చు. కాని విద్యార్ధులు, యువత, లేబర్ కుర్రాళ్లు ఒక వారంలో చైన్ స్నాచింగ్ చేసి ఆ వృత్తిని పక్కనపెడుతున్నారు. దీంతో రోజు రోజుకు కొత్త చైన్ స్నాచర్లు పుట్టుకురావడంతో పోలీసులు ఎవరిని పట్టుకోవలో అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారు.

శాబాష్ షౌకత్ హుస్సేన్…
జిల్లా ఎస్పీ డి. జోయల్ డేవిస్.
ఈనెల 3వ తేది శనివారం ఉదయం 6 గంటల సమయంలో పెద్దపల్లి మండలం రంగంపల్లికి చెందిన ఇద్దరు చైన్ స్నాచర్లు శ్రావణ్ కుమార్ (20) , రాము (22) లు భాగ్యనగర్ లో ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న బైక్ ను దొంగలించారు. అనంతరం అదే కాలనీలో ఇంటి ముందు పూలు తెంపుతున్న ఓ మహిళ మెడలొంచి పుస్తేలాతాడును తెంపుకెళ్లారు. దొంగలించిన బైక్ ను కొత్తయాస్వాడ శివారులో వదిలివెళ్లిపోయారు. అదే విధంగా ఆదివారం ఉదయం అదే విదంగా సుభాష్ నగర్ లో ఓ బైక్ దొంగలించిన సదరు చైన్ స్నాచర్లు…ఆదివారం ఉదయం 5:30 గంటల సమయంలో జ్యోతినగర్ ఓ మహిళ మెడలో గొలుసు దొంగలించేదుకు యత్నించడంతో మహిళ ప్రతిఘటించి సదరు వ్యక్తి చెయ్యి కొరకడంతో వారి దొంగతనం విఫలమైంది. దీంతో జ్యోతినగర్ లోని ఇంగ్లీష్ యూనియన్ స్కూల్ లైన్ లో ఓ వృద్దురాలు ఇంటిముందు పూలు కొస్తున్న సందర్బంలో శ్రావణ్ కుమార్ ఆ వృద్దురాలి వద్దకు వెళ్లి….అమ్మ నేను పూలు తెప్పిస్తాను అని చెప్పి వృద్దురాలు వద్దకు రాగనే ఆమె మెడలొంచి పుస్తెలతాడును తెంపుకొని పరారయ్యారు. దీంతో స్థానికుల సమాచారంతో రెండవపట్టణా పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించడంతో స్టేషన్ నుంచి వైర్ లైస్‌సెట్ ద్వారా ఉదయం పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు సమాచారం అందిస్తారు. దీంతో సప్తగిరికాలనీలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న రెండవ పట్టణ ఐడి పార్టీ కానిస్టేబుల్ షౌకత్ హుస్సేన్ వైర్‌లేస్ సేట్ లో సంబంధిత చైన్ స్నాచర్ల ఆధారణలను విన్న కానిస్టేబుల్ చాకచక్యంగా వ్యవహరించి మాచర్లగార్డన్ కస్తూరిభా పాఠశాల ముందు నుంచి ఇద్దరు వ్యక్తులు అనుమానస్పదంగా తరసపడటంతో సదరు వ్యక్తులను ఐడి పార్టీ కానిస్టేబుల్ షాకత్ హుస్సేన్ బైక్ పై వెళ్తున్న ఇద్దరి అపి తనిఖీ చేస్తున్న సమయంలో బైక్ వెనుకల కుర్చున్న రాము అనే వ్యక్తి బైక్ పై నుంచి దూకి పారిపోయాడు. దీంతో మరో వ్యక్తి శ్రావణ్ కుమార్ ను కానిస్టేబుల్ షౌకత్ హుస్సేన్ , హోంగార్డు మల్లేషం లు పట్టుకొని నగర డిఎస్పీ రామారావు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న డిఎస్పీ సదరు స్నాచర్ ను పట్టుకొని మరో దొంగకోసం వెతుకులాట మొదటలు పెట్టారు. రెండపట్టణ ఐడి పార్టీ కానిస్టేబుల్ షౌకత్ హుస్సేన్ ను వెంటతీసుకొని నగర డిఎస్పీ రామారావు సినీ ఫక్కిలో మరొ దొంగను పట్టుకున్నారు. మాచర్ల గార్డన్ వద్ద దొరికిన దొంత శ్రావణ్ కుమార్ సహయంతో మరో దొంగ రాము ను పట్టుకునేందుకు సదరు వ్యక్తి సెల్ ఫోన్ నుంచి రాముకు ఫోన్ చేసి…తాను పోలీసుల నుంచి తప్పించుకున్నానని కరీంనగర్ నుంచి మనం పెద్దపల్లికి వెళ్లిపోవాలని చెప్పడంతో అప్పటికే రైల్వే స్టేషన్ లో పుస్పుల్ ట్రైన్ లో పెద్దపల్లికి పారిపోయేందుకు సిద్దంగా ఉన్న రాము రైల్వే స్టేషన్ నుంచి తీగలగుట్టపల్లి రైల్వే క్రాసింగ్ వద్దకు వచ్చాడు. సందర్భంలో తాను రైల్వే స్టేషన్ వద్ద ఉన్న సమాచారం చెప్పడంతో డిఎస్పీ రామారావు , రెండవపట్టణ ఐడి పార్టీ కానిస్టేబుల్ షౌకత్ హుస్సేన్లు పక్కసమాచారంతో మరో చైన్ స్నాచర్ రామును సినీ ఫక్కిలో పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఠాణాకు తరలించిన అనంతరం పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో మరో చైన్ స్నాచర్ సునీల్ వివరాలు వెళ్లడించారు. అయితే మరో వ్యక్తి హైదరాబాద్ లో పనిచేస్తున్న సునీల్ ను ఆదివారం రాత్రి కరీంనగర్ పట్టణా పోలీస్ స్టేషన్ కు ఎస్సై దామోదార్ రెడ్డి హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారు. నగరంలో చైన్ స్నాచర్ల బెడద ఎక్కువడంతో పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. అయితే పట్టణంతో పాటు జిల్లాలో గొలుసుదొంగతానలు ఎక్కువకావడంతో జిల్లా ఎస్పీ కిందస్థాయి సిబ్బంది నుంచి పై స్థాయి అధికారి వరకు ఒత్తిడి తెస్తున్నారు. కాగా, సినీ ఫక్కిలో దొంగలను పట్టుకున్న రెండవపట్టణ ఐడి పార్టీ కానిస్టేబుల్ షౌకత్ హుస్సేన్ జిల్లా ఎస్పీ డి. జోయల్ డేవిస్ అభినందించారు. అదే విధంగా జ్యోతినగర్ లో పుస్తేలా తాడు తెంపుకెళ్లిన సంఘటనలో బాధితురాలు అనసూర్య ఆనందం వ్యక్తం చేసిసింది. దొంగలించిన గంట వ్యవధిలోనే దొంగలెత్తుకెళ్లిన బంగారం మళ్లీ దొరకడంతో డిఎస్పీ రామారావు, కానిస్టేబుల్ షౌకత్ హుస్సేన్ , హోంగార్డు మల్లేషం , కృతజ్ఞతాలు తెలిపారు. దొంగలించిన గంట వ్యవధిలోనే దొంగలను పట్టుకునందుకు నగర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విధంగా పోలీసులు 24 గంటల పాటు పెట్రోలింగ్ నిర్వహిస్తు దొంగలను బెడద లేకుండా చూడలని నగర ప్రజలు కోరుతున్నారు.

చైన్ స్నాచింగ్ ఎలా మొదలైంది.
మహారాష్ట్ర గ్యాంగ్ పనేనని పోలీసుల అనుమానం.

మహారాష్ట్ర లోని నాందేడ్ ప్రాంతంలో వంద ఏళ్లక్రితం పిండారి అనే సంచారజాతికి చెందిన వారు పార్ధీ దొంగళ ముఠా. ఇందులో నాలుగురు నుంచి ఏడుగురి వరకు ఉత్తర తెలంగాణలోని మూడు జిల్లాలో సంచారిస్తారు. ఈ ముఠాలో ఉన్నావారు 20 ఏళ్ల వయస్సు వారే. వీరు ఓ ముఠాగా ఏర్పడి, నేరాలకు పాల్పడుతారు. డబ్బుకోసం ఎంతకైన తెగించే వీరు పలు రాష్ట్రాల్లో దొంగతానలు చేసి మళ్లీ నాందేడ్ కు వెళ్లపోయేవారు. అయితే నాందేడ్ ప్రాంతం పై వివిధ రాష్ట్రాల పోలీసులు విచారణ నిమిత్తం అక్కడకి వెళ్లడంతో ముంబాయి దగ్గరలో ఉన్న పర్లి జిల్లాకు సమీపంలోని రైల్వే బిడ్జ్రి పక్కన నున్న కాలనీ వసంతతాండలో నివసిస్తూ నేరాలు చేస్తున్నారు. ప్రధానంగా రైల్వేలైన్ సమీపంలో ఉన్న గ్రామాలకు చేరుకొని హత్యలు, బంగారం దోపీడిలకు పాల్పడుతున్న ముఠా తిరిగి లారీల ద్వారా ముంబాయికి వెళ్ళేవారు. వీరు చిన్న పాటి ఆయుధాలు జేజులో పెట్టుకొని వెళ్లే సమర్ధం కల్గిగే రాడ్ లను పెట్టుకొని సంచరిస్తారు. ఈ దొంగళ ముఠా సభ్యులు దొంగతానికి వెళ్లినప్పుడు ఇంట్లో నిద్రిస్తున్నవారు మేల్కొంటే అల్లరి చేస్తారు…ఆ మాటలచప్పుడు విని చుట్టుపక్కలవారు లేస్తారు. ఇదంతా గోల ఎందుకు మంచంలో పడుకున్నవారిని పడుతున్నట్లు చప్పుడులేకుండా చంపేస్తే తమపని సులభంగా అవుతుంది. ఇదీ పార్థీముఠా సభ్యుల దోపిడి తీరు. చంపిన తర్వాతే ఆ ఇంట్లో నగదు, బంగారం కోసం గాలించి దొరికినకాడికి దోచుకెళ్లడం వీరినైజం. ఊరికి చివరన ఒంటరిగా ఉన్న ఇళ్లే వీరి టార్గెట ఉన్నవాళ్లు, లేని వాళ్లు అనే తేడా లేకుండా ముందుగా ఎలాంటి రెక్కీలు ఉండవు. రైలు దిగిందంటే రాత్రిదాకా పరిసరాల్లో దాక్కొని లేదా, సినిమాలకు వెళ్లడం లాంటిలి చేస్తారు. రాత్రి చీకటి పడిన తర్వాత కనిపించిన ఇండ్లల్లో చోరీలు చేస్తారు. ఇలా అయితే హత్యలు చేసి వెళ్లిపోతున్న సందర్భంలో పోలీసులకు పట్టుబడుతున్నమని.. ఈ చైన్ స్నాచింగ్ కు అలవాటు పడ్డారు. అయితే మహారాష్ట్రకు చెందిన పర్లి జిల్లా వసంతతాండకు చెందిన కరన్ అనే మాజీ హంతకుడు ఏర్పాటు చేసుకున్న నలుగురు సభ్యుల ముఠానే ఈ పార్థీ దొంగలాముఠా. పర్లి జిల్లా నుంచి ఆదిలాబాద్ , నిజామాబాద్ , కరీంనగర్ జిల్లాలకు బైక్స్ పై వచ్చేవారు. అయితే అక్కడ నుంచి బయలుదేరే ముందు డ్రగ్స్ , గంజాయి సేవించి బైక్స్ తీసుకొని వచ్చేవారు. రహదారి వెంబడి వస్తున్న సమయంలో పక్కన ఉండే గ్రామాల్లో చైన్ స్నాచింగ్ చేసి వెళ్లిపోయే వారు. కొన్ని సందర్భల్లో దొంగలను పట్టుకొనేందుకు పోలీసులు పర్లి జిల్లా లోని వసంతతాండ కు వెళ్లన సమయంలో ఆ తండా వాసులు రాడ్లు, కత్తులు, కంట్లో కారం చల్లి దాడులకు సైతం దిగుతారని సమాచారం. గత సెప్టెంబర్ 10న మెదక్ జిల్లా రాంచంద్రపూర్ పోలీసులకు ఓముఠా చెక్కింది. వీరిలో తరుణ్ , పేర్యా, పరమేశ్వర్ , సంతోష్ ఉన్నారు. సోనూ, పింటు మాత్రం పరాలీలో ఉన్నారు. ఇలాంటి పార్థీ ముఠాలు మరో ఐదారు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా మరో ముఠా బవారియా ముఠా..ఎక్కువగా బ్యాంకులు, ఆలయాలకు కన్నాలు వేస్తారు. చోరీ చేయాలనుకున్న బ్యాంక్ ను ఎంచుకొన్న తర్వాత పూర్తిస్థాయిలో రెక్కి నిర్వహిస్తారు. బ్యాంక్ బలహినతలు గుర్తించి అనుకున్న సమయానికి చేరుకొని చోరీలు చేసి చల్లాగా జారుకుంటారు. అయితే జిల్లాలో ఈ రెండు ముఠాలు పలు సంఘటనలకు పాల్పడ్డట్లు పోలీసులు భావిస్తున్నారు. హుస్నాబాద్ బ్యాంక్ , ముల్కనూర్ బ్యాంక్ , కరీంనగర్ మంకమ్మతోట బ్యాంక్ , నగునూర్ ఆంధ్రబ్యాంక్ చోరితో పాటు ఆదిలాబాద్ , నిజామాబాద్ , వరంగల్ , నల్గొండ జిల్లాలో పలు బ్యాంకు చోరీలు చేశారు. గతంలో కాల్వ శ్రీరాంపూర్ వద్ద జరిగిన చోరీ, హత్య సంఘటనలో వీరి పైనే అనుమానలు వ్యక్తమయ్యాయి. వీటిలో రాజస్థాన్ , తమిళనాడు ముఠాలు ప్రత్యేకమైనవి. ఐదు లేదా ఏడుగురు వ్యక్తులు కలిసి ఒక ముఠాగా ఏర్పడి చోరీలు చేస్తుంటారు. అయితే మొదట వీరు వివిధ పనుల కోసమో , ఏదైనా వస్తువులు అమ్మకాలు చేసే వారిలాగా కాలనీల్లో తిరుగుతూ వారు చోరీ చేయాలనుకున్న ఇంటిని ఎంపిక చేస్తారు. మొదట సైకిల్ మీద ప్లాస్టిక్ వస్తువులు, దువ్వెనలు, పౌడర్లు అమ్ముతు వాడల్లో తిరుగుతు ఆడవాళ్లతో దగ్గర అవుతారు. మాటల్లో పెట్టి ఇంట్లో ఎంత సొమ్ము ఉందో చూసుకొని టార్గెట్ చేస్తారు.

ఎక్కడ స్పెషల్ పార్టీ పోలీసులు…?

నగరం లో దొంగలు పడ్డారు…దొంగలు అంటే దొంగలు కాదు..మహా ముదుర్లు. రెప్ప పాటు క్షణంలో మెడలోని పుస్తేలా తాడు దొంగలించుకొని రయ్యిమని పారిపోతారు. పోలీసులు వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు నగరంలోకి మళ్లీ పార్ఠీ, రాంజీ, ఇరానీ ముఠాలు సంచిరిస్తున్నయి. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక డ్రైవ్ ను నిర్వహిస్తున్నారు. రాత్రి సమయంలో ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి స్పెషల్ పార్టీ పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. అయితే దొంగలు మాత్రం తెల్లవారు ఝూమున 5 నుంచి 8 గంటల మధ్య సమయంలో రాత్రి 6 గంటల నుంచి 8 గంటల ప్రాంతంలో కాలనీల్లో దొంగతానలకు తెగబడుతున్నారు. వీరు మహారాష్ట్ర నుంచి అత్యాధునిక వాహనాల పై నిజామాబాద్ , కరీంనగర్ , వరంగల్ ఇలా ఆంధ్రమీదుగా తమిళనాడు రాష్ట్ర వరకు బైక్స్ పై వెళ్తు చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్నారు. మరో విధంగా ఢీల్లి నుంచి వచ్చిన ఓ గ్యాంగ్ డీసిఎం వ్యాన్ లో ద్విచక్ర వాహనలను తెచ్చుకొని నగర శివారు ప్రాంతంలో దింపుకొని రెండు రోజులు నగరంలో శివారు ప్రాంతం, పోలీసుల నిఘా తక్కువగ ఉండే ప్రాంతం అదే విధంగా మద్యాహ్నం పిల్లలకు స్కూల్ టిఫిన్ బాక్స్ ఇవ్వడానికి వెళ్లే మహిళసను టార్గెట్ చేసుకొని దొంగతానలకు పాల్పడుతున్నారు. ఓ చోట స్నాచింగ్ చేసిన నిమిషాల వ్యవధిలోనే మరోచోట చోరి చేసి నగర మహిళలను భయపెడుతున్నారు. రెప్పపాటు కాలంలో పనిముగించుకొని పారిపోతున్నారు. జిల్లాకు కొత్తగా పదవి భాద్యతలు పొందిన ఎస్పీ నేరాలను నిరోధించేందుకు పోలీసులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పేరిట సీసీ కెమెరాలు, అత్యాధునిక వాహనాలను సమకూర్చుకుంటున్నారు. నగరంలో చైన్ స్నాచింగ్ ఎక్కువడంతో పోలీస్ అధికారులు ఐడి పార్టీ , బ్లూకోర్టు పోలీసులకు పెట్రోలింగ్ బైక్స్ అందజేశారు.

సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి.

కరీంనగర్ పట్టణంలో పోలీసుల నిఘా వైఫల్యం కొట్టొచినట్టు తెలిసిపొతుంది. మూడునెలల్లో జరిగిన భారీ చోరీలే దీనికి తార్కాణం. ఇప్పుడిప్పుడే వాణిజ్య పరంగా అభివృద్ధి చెందుతున్న నగరం..అయితే నగరంలోని ప్రధాన కూడళ్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేశారుగాని చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న దొంగలు మాత్రం వీధుల్లోనే ఎక్కువ శాతం గొలుసు దొంగతాలకు పాల్పడుతున్నారు. నగరంలో ప్రతి చోట సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని వ్యాపార సంస్థలు, విద్యాసంస్థలు, కాలనీ ల్లో అపార్ట్ మెంట్ సైతం సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే ఇలాంటి దొంగతనల్లో పోలీసులకు ఉపయోగపడే అవకాశం లేకపోలేదు. అయితే పోలీసులు ఈ దొంగతాలను దృష్యా పట్టణంలో ప్రత్యేక పోలీసుల విభాగాలను ఏర్పాటు చేశారు. వన్ టౌన్ , టూటౌన్ పరధిలో బ్యూకొట్ , ఇంటెలిజెన్స్ , స్పెషల్ బ్రాంచ్ , ఐడి పార్టీ పోలీసులు జనాల్లో తిరుగుతుంటారు. అయితేనేం ఇవేవి దొంగలకు చెక్ చెప్పడం లేదు. ఘటన జరిగాక వివరాలు సేకరణలో నూ వెనకంజే వెస్తున్నారు. చోరీ జరిగిందని ఫిర్యాదు చేసినా ఘటన స్థలానికి పోలీసులు వెళ్లని సందర్భాలున్నాయి. ఈ నిర్లక్షం దొంగలకు వరంగా మారింది. అదృష్టం బాగుండి దొంగలు దొరికితే సొత్తు రికవరీలోనూ పోలీసులు చేతివాటం చూపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పూర్తి స్థాయిలో సొత్తు రికవరి అయినా బాధితులకు ఇవ్వడం లేదని సదరు వ్యక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రికరి చేసిన బంగారంలో పోలీసుల మాయలు కనిపిస్తున్నాయి. బాధితులకు నకిలీ బంగారం కట్టబెడుతున్నట్లు సమాచారం. పట్టణంలో పోలీసులు జనాలకు చైతన్యం తీసుకురావడనికి హోడింగ్ లు వాల్ పోస్టర్స్ లాంటి ఏర్పాటు చేయాలని నగర వాసులు కోరుతున్నారు.

చైన్ స్నాచర్లును పట్టుకోవడం కంటే…మహిళలు జాగ్రత్తలు తీసుకోవడం మేలు.

నగర శివారులో నివసించే వారు బయటకు ఒంటరిగా కాకుండా ఇద్దరు, ముగ్గురు కలిసి రావాలని, పిల్లలకు స్కూల్ లో టిఫిన్స్ ఇవ్వడానికి వెళ్లినప్పుడు, స్కూల్ నుంచి పిల్లలను తీసుకొచ్చే సందర్భంలో మహిళలు చీరకొంగును పూర్తిగా మెడ పైనుంచి బంగారు ఆభరాణాలు కనిపించకుండా వేసుకోవాలి. మహిళలు వెళ్తున్న సమయంలో ఎవరైన బైక్స్ పై అనుమానస్పదంగా తిరుగుతుంటే స్థానిక పోలీసులకు గాని , 100 కుగాని సమాచారం అందించాలి. అదే విధంగా నగర శివారు ప్రాంతంలో పోలీసులు దొంగలు ఎక్కువగా సంచరించే ప్రాంతం అని, దొంగతానం జరిగితే 100కి సమాచారం ఇవ్వాలని వాల్ పోస్టర్స్ గాని, వాల్ పెంటింగ్స్ గాని వ్రాయించాలి. ఇంటి నుంచి బయటకు వెళ్తే,, విలువైన వస్తుపులను ఇంట్లో వదిలివెళ్లరాదు. ఎక్కువ రోజులు ఉరికి వెళ్లాల్సి వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. అదే విధంగా చైన్ స్నాచర్లు పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జిల్లాల పోలీసులకు అత్యాధునిక వాహనలు సమకుర్చిన పోలీసులు మాత్రం ఒక్క చైన్ స్నాచర్ ను పట్టుకున్న దాఖాలు లేవు. చైన్ స్నాచర్లు మహిళల మెడలోంచి బంగారు గోలుసులు తెంచుకుళ్తున్న సందర్భంలో బైక్ పై నుంచి ప్రమాదపు శాత్తు కిందపడిపోయిన సందర్భంలో గాని, దొంగలించే సమయంలో మహిళలుగాని, స్థానికులుగాని తిరగబడ్డ సందర్భంలో ఈ చైన్ స్నాచర్లు పోలీసులకు చిక్కుతున్నరే తప్ప. పోలీసులు మాత్రం ముందస్తు చర్యలు తీసుకోవడంతో పూర్తిగా విఫలమయ్యరనే చెప్పుకొవచ్చు. పోలీసులు తీరు మాత్రం చేతులు కాలక ఆకులు పట్టుకున్న చందంగా వ్యవహరిస్తున్నారు. జిల్లా ఇప్పటివరకు ఒక్క చైన్ స్నాచర్ ను పట్టుకున్న సందర్భలే లేవని కరీంనగర్ జిల్లా వాసులు చర్చించుకుంటున్నారు. అయితే ఒక్క చైన్ స్నాచర్ దొరికిన వారి పై చోరి కేసులు కట్టకుండా..పీడీ యాక్తు కింద కేసులు నమోదు చేయాలి. ఇలా అయితే చైన్ స్నాచర్లు పై పీడీ యాక్ట్ అమలు చేస్తే దాదాపు సంవత్సరా కాలం పాటు ఈ దొంగలు జైలు జీవితాం గడపాల్సివస్తుంది. పోలీసులు ఇలా చోరీ కోసులు కడిదే మాత్రం వారం రోజుల్లో జైలు నుంచి బయటకు వచ్చి..మళ్లీ దొంగతానలకు, చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్నారు.