Home తాజా వార్తలు ఇడి విచారణకు హాజరుకాని చందా కొచ్చర్

ఇడి విచారణకు హాజరుకాని చందా కొచ్చర్

Chanda Kochhar

 

న్యూఢిల్లీ: ఐసిఐసిఐ బ్యాంక్ మాజీ సిఇఒ చందాకొచ్చర్ సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) ఎదుట విచారణకు హాజరుకాలేదు. వీడియోకాన్ గ్రూప్‌కు రుణం మంజూరు కేసులో ఇడి ఆమెకు సమన్లు జారీ చేసింది. అయితే ఆరోగ్య కారణాల వల్ల విచారణ హాజరు కాలేకపోతున్నట్లు సమాచారం ఇచ్చినట్లు ఇడికి చెందిన ఓ అధికారి తెలిపారు. దీంతో మరోసారి ఆమెకు ఏజెన్సీ సమన్లు జారీ చేయనుంది. గత వారం కూడా ఇదే కారణాలతో ఆమె విచారణకు హాజరు కాకపోవడం గమనార్హం.

కాగా ఈ కేసులో మరికొంతమంది బ్యాంకు అధికారులను కూడా ఇడి త్వరలో విచారించనుంది. బ్యాంక్ నిబంధనలకు విరుద్ధంగా వీడియోకాన్ గ్రూప్‌నకు రూ.1875 కోట్లను మంజూరు చేసిన వ్యవహారంలో ఇడి ఇప్పటికే చందాకొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్‌ను పలుమార్లు విచారించింది. వీరితో పాటు దీపక్ సోదరుడు రాజీవ్ కొచ్చర్‌ను కూడా పలుమార్లు ప్రశ్నించింది. ఈ కేసుకు సంబంధించి మనీల్యాండరింగ్ చట్టం కింద చందా కొచ్చర్ ఆమె మరిది రాజీవ్ కొచ్చర్‌ల ఆస్తులను అటాచ్ చేసేందుకు ఇడి యోచిస్తోంది.

Chanda Kochhar did not attended ED inquiry