Home జాతీయ వార్తలు టిఎంసిలో చేరిన చందన్ మిత్ర…

టిఎంసిలో చేరిన చందన్ మిత్ర…

Chandan-mitra

కోల్‌కతా : బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు శనివారం తృణమూల్ కాంగ్రెస్‌లో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అధ్వర్యంలో మాజీ బిజెపి నాయకుడు చందన్ మిత్ర, కాంగ్రెస్ నాయకులు సమర్ ముఖర్జీ, అబు తాహీర్, సబినా యాస్మిన్, అక్రుజ్‌మన్‌లు మమతా పార్టీలో చేరారు. వీరికి మమతా బెనర్జీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. బిజెపి విధి విధానాలు నచ్చకపోవడంతో ఇటీవలే చందన్ మిత్ర ఆ పార్టీకి రాజీనామా చేశారు. భారత ప్రధాని మోడీ, అమిత్ షాల ప్రవర్తనతో పార్టీలో సంతోషంగా లేమని చందన్ పేర్కొన్నారు. 2016లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో హుగ్లీ నియోజకవర్గం నుంచి బిజెపి నుంచి పోటీ చేసి చందన్ మిత్ర డిపాజిట్లు కోల్పోయిన సంగతి తెలిసిందే. జర్నలిస్టుగా కేరీర్ ప్రారంభించిన చందన్ ఢిల్లీ నుంచి ప్రచురితమవుతున్న పాయినీర్ న్యూస్ పేపర్‌కు ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.