Home పెద్దపల్లి గ్రామాల విలీనం వద్దని కెటిఆర్‌కు చందర్ వినతి

గ్రామాల విలీనం వద్దని కెటిఆర్‌కు చందర్ వినతి

Chandra, Putta madhu, KCR

 

మనతెలంగాణ/గోదావరిఖని: రామగుండం నగరపాలక సంస్థలో లింగాపూర్ కుందనపల్లి గ్రామాలను విలీనం చేయొద్దని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌కు విన్నవించినట్టు ఓ ప్రకటనలో తెలిపారు. మరో రెండు రోజుల్లో టిఆర్‌ఎస్ పార్టీలో రామగుండం నియోజకవర్గంలోని పలువురు చేరనున్నారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో కెటిఆర్‌ను కలిసిన ఎంఎల్‌ఎ చందర్ మంథని మాజీ ఎంఎల్ఎ పుట్ట మధుతో కలిసి ఆయనకు వినతి పత్రాన్ని అందజేశారు. కెటిఆర్ సదరు విషయాన్ని పరిశీలిస్తానని హామీ ఇచ్చినట్టు చందర్ తెలిపారు. ఆయన వెంట కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ సాగంటి శంకర్, మెతు కుదేవరాజు, చెలకలపల్లి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

Chandra, Putta madhu with KCR on the merger of villages

Telangana Latest News