Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

అవిశ్వాసంతో లాభం ఉండదు : చంద్రబాబు

CBN

అమరావతి : కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టడం వల్ల ఎపికి ఎటువంటి లాభం ఉండదని ఎపి సిఎం, టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తెలిపారు. కేంద్రంపై అవిశ్వాసం పెట్టాలని వైసిపి చీఫ్ జగన్ అంటున్నారని, అయితే శాసనసభ, పార్లమెంట్ చట్టాల గురించి తెలియకుండా జగన్ మాట్లాడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. బిజెపి నుంచి టిడిపి దూరమైతే, బిజెపితో పొత్తు పెట్టుకోవాలని జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకుండా వైసిపి, కాంగ్రెస్ పార్టీలు అడ్డుపడుతున్నాయని ఆయన ఆరోపించారు. సోమవారం ఆయన పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించారు. పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. రాష్ట్ర విభజన హామీలపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో విభజన హామీలపై చర్చిస్తామని ఆయన పేర్కొన్నారు. విభజన హామీలను అమలు చేయకపోవడంపై కేంద్రం ఎపి ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. విభజన హామీలు నెరవేరేవరకు తమ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు.

Chandrababu Comments on Jagan

Comments

comments