Search
Wednesday 19 September 2018
  • :
  • :

బీళ్లకు నీళ్లు

ha

గోదావరిపై ప్రాజెక్టులను చూసి ఎపి సిఎం కళ్లల్లో కారం పోసుకుంటున్నారు 

కాళేశ్వరం ఆపించాలని ఢిల్లీకి చంద్రబాబు లేఖలు రాస్తున్నారు
సూరమ్మ ప్రాజెక్టుతో బీడు భూములన్నీ సస్యశ్యామలం కానున్నాయి
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం కలికోట వద్ద రిజర్వాయర్‌కు శంకుస్థాపన సభలో మంత్రి హరీశ్‌రావు

మన తెలంగాణ/ సిరిసిల్ల/రుద్రంగి/ జగిత్యాల:నోళ్లు తెరిచిన బీడు భూములన్నీ సూరమ్మ ప్రాజెక్టుతో తడిసి సస్యశ్యామలం కానున్నాయని రాష్ట్ర నీటి పారుదల శాఖమంత్రి హరీశ్‌రావు అన్నారు. ఎత్తిపోతల ద్వారా మెట్ట ప్రాంతంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలని మాజీ ఎం ఎల్‌ఎ చెన్నమనేని రాజేశ్వర్‌రావు కన్న కలలు నేడు సహకారం కానున్నాయన్నా రు. కలికోట వద్ద సూరమ్మ ప్రాజెక్టుకు మంత్రి హరీశ్‌రావు శుక్రవారం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మరో మంత్రి ఈటల రాజేందర్, వేములవాడ ఎంఎల్‌ఎ చెన్నమనేని రమేశ్, కోరుట్ల ఎంఎల్‌ఎ విద్యాసాగర్‌రావు, జెడ్‌పి చైర్ పర్సన్ తుల ఉమ, మార్క్‌ఫెడ్ చైర్మన్ లోకబాపురెడ్డి, ఎంఎల్‌సి నారదాసు లక్ష్మణ్‌రావు, తదితరులు పాల్గొన్నారు. మంత్రి హరీశ్‌రావు ప్రసంగిస్తూ సూరమ్మ చెరువు ప్రాజెక్టు ద్వారా కథలాపూర్, మేడిపల్లి రైతాంగానికి మేలు జరిగే దిశగా రూ. 203 కోట్ల వ్యయంతో 45 వేల ఎకరాల భూములకు సాగు నీరందించే ఆలోచన కు రాజేశ్వర్‌రావు తనయుడు వేములవాడ ఎంఎల్‌ఎ రమేశ్‌బాబు అంకురార్పణ చేశారన్నారు. తండ్రి ఆశయాలకు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సూరమ్మ ప్రాజెక్టు నిర్మించాలని సంకల్పించరన్నారు. ఆ దిశగా సిఎం కెసిఆర్‌పై ఒత్తిడి తెచ్చి ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేయించాడరని హరీశ్ చెప్పారు. బంగారు తెలంగాణలో రైతే రాజును చేయాలనే లక్షం కోసం చిత్తశుద్ధ్ధి తో పనిచేస్తున్నారని కొనియడారు. సూరమ్మ చెరువు నాగారం చెరువుల ద్వారా కథలాపూర్, మేడిపల్లి, రుద్రంగి రైతాంగానికి మేలు జరుగుతుందన్నారు. స్థానిక ప్రజలంతా సహకరించి 300ల ఎకరాల భూమి ఇస్తే వచ్చే దసరా నాటికి సూరమ్మ చెరువు పూర్తిచేసి ఆడబిడ్డలు బతుకమ్మలు అడేవిధంగా పూర్తిచేసి చూపిస్తామన్నారు. మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ కాళేశ్వరంకు అడ్డుకట్ట వేసిందే చంద్రబాబు అని, మరో వైపు ఇక్కడి కాంగ్రెస్ నాయకులు కోర్టుల చుట్టూ తిరిగి ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
ఎవరు అడ్డుపడ్డా ప్రాజెక్టుల నిర్మాణం ఆగదు
గోదావరిపై చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణాలతో ఎపి సిఎం చంద్రబాబు కళ్లలో కారం పోసుకుంటున్నాడని, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపివేయాలంటూ ఢిల్లీకి లేఖలు రాస్తున్నారని మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని కలికోటలో చేపట్టిన సూరమ్మ రిజర్వాయర్ నిర్మాణ పనులకు మంత్రి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా హరీష్‌రావు మాట్లాడుతూ గోదావరి జల్లాలకు 954 టిఎంసిలు కేటాయించినట్లు పూర్వ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి అఫిడవిట్ ఇచ్చిందని, దానికి కట్టుబడే ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారన్నారు. ఎపిలో ఓట్లు రాబట్టుకునేందుకే చంద్రబాబు ప్రాజక్టులకు అడ్డుపడుతున్నాడని, చంద్రబాబు కాదు కదా ఎవరు అడ్డు పడ్డా ప్రాజెక్టుల నిర్మాణం ఆగదన్నారు. చంద్రబాబు తీరును కాంగ్రెస్ నాయకులు ఎందుకు ఖండించడం లేదని మంత్రి ప్రశ్నించారు. లోలోపల కాంగ్రెస్, టిడిపిలు ఒక్కటేనని, ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కాంగ్రెస్ కోర్టు ల్లో కేసులు వేస్తే, టిడిపి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తోందన్నారు. తెలంగాణకు అన్యా యం చేసే విధంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నందున, తెలంగాణ టిడిపి నాయకులకు తెలంగాణ ప్రజలపై ఏ మాత్రం ప్రేమ ఉన్నా వెంటనే రాజీనామా లేఖలు చంద్రబాబు ముఖాన కొట్టి పార్టీ నుంచి బయటకు రావాలన్నారు.

Comments

comments