Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

బిజెపి యేతర సిఎంలతో బాబు కీలక భేటీ

BABU

న్యూఢిల్లీ: ఢిల్లీలో బిజెపియేతర రాజకీయాలు ఊపందుకున్నాయి. ఆదివారం జరగబోయే నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన ఎపి సిఎం చంద్రబాబు నాయుడు బిజెపి యేతర ముఖ్యమంత్రులతో భేటీ అయ్యారు. ఎపి భవన్‌లో  చంద్రబాబు తో పశ్చిమ్‌ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ, కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, కేరళ సిఎం పినరయి విజయన్‌లతో సమావేశం అయ్యారు. ఈ భేటీలో దేశంలోని తాజా రాజకీయ పరిస్థితులపై కీలక చర్చలు జరిపే అవకాశం ఉంది. ఈ చర్చల అనంతరం చంద్రబాబు, మమతా బెనర్జీ, కుమారస్వామి, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ దగ్గరకి వెళ్లనున్నారు. పలు సమస్యల పరిష్కారం కోసం లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కార్యాలయంలో గత కొన్ని రోజులుగా దీక్షకు చేస్తున్న కేజ్రీవాల్‌కు నేతలు తమ మద్దతు తెలపనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా చంద్రబాబుతో పాటు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, పలువురు సీనియర్ అధికారులు కూడ వెళ్లారు. రేపు ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశానికి చంద్రబాబు పూర్తిగా సన్నద్ధమయ్యారు. ఇందుకోసం రాష్ట్ర సమస్యలపై 24 పేజీల రిపోర్టును చంద్రబాబు సిద్ధం చేసుకున్నారు. జిఎస్టి వల్ల రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై కూడా ప్రధానిని నిలదీయాలని ఆయన భావిస్తున్నారు. 15వ ఆర్థిక సంఘ విధివిధానాల సవరణలపై బాబు అభ్యంతరాలు తెలపనున్నారు. ఒకవేళ ఈ సమావేశంలో రాష్ట్ర సమస్యలపై మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే నిరసన తెలపాలని  సిఎం చంద్రబాబు భావిస్తున్నారు.

Comments

comments