Home తాజా వార్తలు బాబును టెంపరరీ సిఎంగానే చూస్తున్నారు….

బాబును టెంపరరీ సిఎంగానే చూస్తున్నారు….

Kanna-Laxminarayana

అమరావతి: పోలవరం జాప్యానికి ఎపి సిఎం చంద్రబాబునాయుడు అసమర్థత కాదా అని బిజెపి నేత కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ…..  తన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు బిజెపి దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో బాబు అడ్డంగా దొరికిపోయిన దొంగ అని, భయంతోనే హైదరాబాద్ నుంచి పారిపోయి ఎపికి వచ్చారని దుయ్యబట్టారు. ప్రజలు చంద్రబాబును టెంపరరీ ముఖ్యమంత్రిగానే చూస్తున్నారన్నారు. విదేశాలు తిరిగి బాబు ఎన్ని పెట్టుబడులు తెచ్చారని ప్రశ్నించారు. బాబు సొంత సంస్థ హెరిటేజ్‌నే ఎపికి ఎందుకు తీసుకురాలేదన్నారు. టిడిపి నేతలు తమ సంస్థలను ఎపికి ఎందుకు తీసుకురావడం లేదని అడిగారు.