Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

రాష్ట్రానికి చిన్న పరిశ్రమలు రావాలి : చంద్రబాబు

chandra-babu
అమరావతి: ఎసి సిఎం చంద్రబాబు నాయడు బుధవారం పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెద్ద పరిశ్రమలతో పాటు చిన్న పరిశ్రమలు రావాలని చంద్రబాబు అన్నారు. చిన్న పరిశ్రమలతోనే ఎక్కువ ఉద్యోగాలు అవకాశాలు ఉంటాయని తెలిపారు. అంతేకాకుండా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వస్తుందన్నారు. పారిశ్రామిక వేత్తలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక వసతులు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్‌ఎంఇ టౌన్‌షిప్‌ ఏర్పాటు కావాలని ఆయన పేర్కొన్నారు. 9 నెలల్లో మల్లవెల్లి ఇండస్ట్రియల్ ఏరియాగా మారాలని చంద్రబాబు స్పష్టం చేశారు. కాలుష్యం లేకుండా పరిశ్రమలు నడపాలని పారిశ్రామిక వేత్తలకు చంద్రబాబు తెలియజేశారు.

Comments

comments