Search
Thursday 15 November 2018
  • :
  • :

తక్కువ వ్యయంతో చంద్రయాన్2

హాలీవుడ్ సినిమా ‘ఇంటర్‌స్టెల్లార్’ కన్నా తక్కువ ఖర్చు, మొదలైన సందడి

Chandrayaas

న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న చంద్రయాన్2 యాత్రపై సందడి మొదలైంది. ఈసారి చంద్రుడిపై రోదసి వాహకాన్ని మొదటిసారి దించబోతుండడంతో అంతరిక్ష సర్కూట్‌లో సందడి చోటుచేసుకుంటోంది. చంద్రుడి పైకి రోదసి వాహనాన్ని పంపడం భారత్‌కు ఇది రెండోసారి. ఇదివరలో చంద్రయాన్1ను కూడా ప్రయోగించింది. అయితే చంద్రుడిపై భారత్ రోదసి ల్యాండర్ దిగడం ఇదే మొదటిసారి కాబోతున్నది. ఈ ప్రయోగానికి అయ్యే ఖర్చు హాలీవుడ్ సినిమాకన్నా స్వల్పమన్నది ఇక్కడ గమనించాల్సి విశేషం. 2014లో నిర్మించిన హాలీవుడ్ చిత్రం ‘ఇంటర్‌స్టెల్లార్’ ఖర్చు రూ. 1062 కోట్లు( 165 మిలియన్ డాలర్లు) కాగా, చంద్రయాన్2కు అయ్యే ఖర్చు కేవలం రూ.800 కోట్లు కానున్నది. 2013లో ఇస్రో చేపట్టిన అంగారక యాత్రకు అయిన వ్యయం రూ. 470 కోట్లే. అది అదే సంవత్సరం నిర్మించి న హాలీవుడ్ చిత్రం ‘గ్రావిటీ’ వ్యయంరూ. 644 కోట్లు(100 మిలియన్ డాలర్లు) కన్నా తక్కువే.
వృథా ఖర్చు నివారణకు
భారత్ ఈ రెండో చంద్రమండల యాత్ర 2018 ఏప్రిల్‌లో జరుగుతుంది. చంద్రుడి పరిశోధనకు సంబంధించినంత వరకు అత్యంత ఆసక్తికర భారత్ పరిశోధన ఇది. ఈ చంద్రయాన్2 యాత్ర ను సకాలంలో పూర్తిచేయడమేకాక, అతిస్వల్ప ఖర్చుతో చేస్తున్నది. ‘రోదసి వాహనం అభివృద్ధి ప్రతి దశను మేము నిశితంగా గమనిస్తున్నాము. అందుకనే వృథా ఖర్చును నివారించగలుగుతున్నాం’ అని ఇస్రో ఛైర్మన్ కె. శివన్ ఓ ఇంటర్వూ లో తెలిపారు. దీనికి ముందు‘టైమ్స్ ఆఫ్ ఇండియా’కు ఇచ్చి న ఇంటరూలో ఆయన రోవర్‌ను దింపే రెండు చం ద్రుడిపై స్థలాలను గుర్తించామన్నారు. ఆ రెండింటిలో ఒకదాన్ని ఖరారు చేస్తామన్నారు. ఆ ప్రదేశంలో ఏ ఇతర చంద్రుడి యాత్రా ప్రయోగాలు కాలూనలేదని కూడా తెలిపారు.
త్వరలో ప్రయోగం
‘శ్రీహరికోట నుంచి చంద్రయాన్2ని ప్రయోగించనున్నాం, అది చంద్రుడి కక్షలోకి చేరడానికి ఒకటి, రెండు నెలల సమయాన్ని తీసుకుంటుంది’ అని ఇస్రో చీఫ్ శివన్ తెలిపారు. చంద్రయాన్1ను పిఎస్‌ఎల్‌వి రాకెట్ ద్వారా ప్రయోగించగా, దాదాపు 3290 కిలోల బరువుండే రోదసి వాహనం చంద్రయాన్2ను హెవీ పేలోడ్ లిఫ్టర్ జిఎస్‌ఎల్‌వి ఎంకె 2 ద్వారా ప్రయోగించనున్నారు. ఈ ప్రయోగంలో ఆరు చక్రాల రోవర్‌ను కూడా తీసుకుపోనున్నారు. దానిని గ్రౌండ్ కమాండ్స్ ఆదేశాల ప్రకారం సెమీఅటానమస్ మోడ్ లో నిర్ణీత స్థలంలో దించనున్నారు. అది చంద్రుడిపై దిగి న ప్రదేశంలో అటూఇటూ తిరుగాడుతూ చంద్రుడి ఉపరితలంను పరికరాల ద్వారా పరిశీలించి డేటాను తిరిగి భూమండలానికి పంపిస్తుంది.దాని ద్వారా చంద్రుడి మన్ను తీరును విశ్లేషించే వీలుంటుంది. ఆరు చక్రాల ఈ రోవర్ ఆ ప్రదేశంలో రసాయన పరిశోధనను కూడా చేపడుతుంది. ఆ వివరాలను చంద్రయాన్2 రోదసి వాహ కం ద్వారా భూమికి పంపిస్తుందని ఇస్రో తెలిపింది. చంద్రుడి కక్ష 100 కిమీ. కు చేరగానే రోవర్‌ను తీసుకెళ్లే ల్యాండర్ రోదసి వాహకం నుంచి వేరవుతుంది. నియంత్రిత పతనం తర్వాత చంద్రుడి ఉపరితలంపై ఉం డే మృదువైన ప్రదేశంలో ల్యాండర్ దిగుతుంది.

Comments

comments