Home మహబూబ్‌నగర్ నిషాలో కుషి కాటేస్తున్న కల్తీ కల్లు

నిషాలో కుషి కాటేస్తున్న కల్తీ కల్లు

Change Stone mafia as a syndicate

పేరుకే కల్తీకల్లు, గుడుంబ రహిత జిల్లా

జరిగేదంతా కల్తీకల్లు విక్రయాలే
యథేచ్ఛగా గుడుంబా విక్రయాలు
సిండికేట్‌గా మారుతున్న కల్లు మాఫియా
అందరికి నెల మామూళ్లు
కృత్రిమ పరిశ్రమగా మారిన కల్లు తయారీ
అనారోగ్యం పాలవుతున్న పాలమూరు బిడ్డలు
యువత వయస్సులోనే వృధ్యాప్యం వస్తున్న వైనం

మన తెలంగాణ/ మహబూబ్‌నగర్: కల్లు, రహిత గుడుంబా జిల్లాగా అట్టహాసంగా ప్రకటించుకొని శభాష్ అనిపించుకున్న ఉమ్మడి పాలమూరు జిల్లాలో నేడు వాటికి తిలోదకాలు ఇచ్చింది. ఎక్సైజ్ శాఖ అధికారులు ఉదాశీనత, అవినీతి వెరసి ఇప్పడు ఎక్కడ చూసినా కల్తీకల్లు కుటీర పరిశ్రమగా మారింది. ఏ గల్లిలో చూసినా కృత్రిమ కల్లు దర్శనమిస్తుండడం గమనార్హం. టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ కల్తకల్లుపై ఉక్కుపాదం మోపారు. ముఖ్యంగా గుడంబా తాగిన ప్రజలు చనిపోయి కుటుంబాలు వీధినపడుతున్నాయని గ్రహించిన కెసిఆర్ గుడుంబ రహిత, కల్తీకల్లు లేని రాష్ట్రంగా మార్చాలని సంకల్పించారు. ఈ నేపథ్యలో మొదట్లో ఎక్సైజ్ శాఖ అధికారులతో పాటు, రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం అంతా కలసి కట్టుగా కల్తీకల్లు, గుడుంబా కేంద్రాలపై దాడులు చేసి వణుకు పుట్టించారు. అనేక మందిపై కేసులు నమోదు చేశారు. గుడుంబ తయారీని అరికట్టేందుకు సంబందిత వ్యక్తుల కుటుంబాలకు ఉచితంగా రుణాలు కల్పించి మాన్పించారు. కల్తీకల్లుకు ఉపయోగించే క్లోరోహ్రైడేడ్,డైజోఫాం వంటి వాటిపై ప్రభుత్వం నిషేదం విధించింది.ఈ నేఫథ్యంలో జిల్లా వ్యాప్తంగా కల్లుకు అలువాటు పడిన వారి నుంచి వ్యతిరేకత వ్యక్తం అయినప్పటికీ తర్వాత వారికి వైద్యం చేసి మామూలు మనుషులుగా మారేందుకు ప్రభుత్వం సహకరించింది.దీంతో అధికారులు సగర్వంగా కల్తీకల్లు, గుడుంబ రహిత జిల్లాగా రాష్ట్రంలోనే మొదటి జిల్లాగా పాలమూరు జిల్లాను ప్రకటించి ప్రభుత్వం నుంచి శభాష్ అనిపించుకున్నారు. ఇంత వరకు బాగనే ఉన్నపప్పటికీ తర్వాత వాటి తయారిపై నిఘా లేక పోవడంతో తిరిగి కల్తీకల్లు, గుడుంబ తయారీ యధాతదంగా కొనసాగుతున్నాయి. తిరిగి పేదల బతుకుల్ని చిద్రం చేస్తున్నాయి.అధికారులకు మామూళ్లు ముడుతుండడంతోనే ఈ విధంగా తయారు చేస్తున్నారన్న ఆరోపణలను ఎక్సైజ్ శాఖ మూటకట్టుకుంటోంది.

ఎక్కడ చూసినా కల్తీకల్లే..
జిల్లాలో ఎక్కడ చూసినా కల్తీకల్లే దర్శనమిస్తోంది. జిల్లాలో మహబూబ్‌నగర్ అర్బన్, రూరల్, నవాబ్‌పేట,హన్వాడ, చిన్న చింతకుంట మండలాల్లో 87 టిఎఫ్‌టిలు,టిసిఎస్‌లు ఉన్నాయి. టిఎఫ్‌టి అంటే ట్రీ ఫర్ ట్యాంపరింగ్ అంటే కల్లుగీసే వారికి లైసన్సులు ఇవ్వడం, టిసిఎస్ అంటే ఇందులో ఎంతమంది ఉన్నప్పటికీ సొసైటీగా ఏర్పాటు చేసుకొని అధ్యక్షులు కమిటీ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే జిల్లాలో టిసిఎస్‌లో అనేక మంది బినామి పేర్లతో కొందరు సొసైటీగా ఏర్పాటు చేసుకొని గుత్తాధిపత్యంగా కల్లుదుకాణాలు నడుపుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు అందులోని సభ్యలుకు నెలకు రెండు వేల నుంచి మూడు వేల వరకు జీతం లాగా ఇచ్చే విధానాన్ని ప్రవేశ పెట్టి వచ్చిన లాభాన్నంతా గుత్తాధికారుడే పొందేలా జరుగుతోంది. దీంతో అనేక మంది పేద గీత కార్మికులు నష్టపోతున్నారు. జిల్లాలో కొందరు సిండికేట్‌గా ఏర్పడి కల్లు సొసైటీల పేరుతో అందులో కల్తీకల్లు తయారు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. గుట్టు చప్పడు కాకుండా సిహెచ్‌లు కలపి, డైజోఫాం, కుంకుడు పువ్వు, బియ్యం నీళ్లు కలిపి కల్తీకల్లును తయీరు చేసి విక్రయిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కల్లుకు అలువాటు పడిన పేదలు తమ కస్టాన్ని మరచి పోయేందుకు ఈ కల్తీకల్లు బారిన పడి బానీసలుగా మారుతున్న సందర్భాలు ఉన్నాయి,ఇప్పటికే సిహెచ్‌తో పేగులకు రంద్రాలు పడి పెద్ద మెదడు పని చేయక పోకుండా ఉండి అనారోగ్య బారిన పడుతున్నారు. దీంతో ఒక్క రోజు కల్లు లేకుండా ఉండలేని పరిస్థితులు నెలకొన్నాయి. కల్లు లేకుండా పిచ్చిపిచ్చిగా ఉంటూ పూనకం వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఆరోగ్యం గుల్ల చేసుకుంటున్నారు. కల్తీకల్లుకు ఉపయోగపడే సిహెచ్ అటు కర్నూలు, కర్నాటక నుంచి రహస్యంగా జిల్లాలోకి తీసుకొస్తున్నారన్నట్లు సమాచారం. ఎక్సైజ్ శాఖ అధికారులకు ఈ విషంయ తెలిసినప్పటికీ మిన్నకుండి పోతున్నారు.సాక్షాత్తు జిల్లా కేంద్రంలోనే ఎనుగొండ, రైతు బజార్, క్ట్రిష్టియన్ పల్లి, కింసానిపల్లె,చుట్టు, బూత్‌పూర్, జడ్చర్ల, వంటి అన్ని ప్రాంతాల్లో కల్తీకల్లు విక్రయాలు జరుగుతున్నాయి. కల్లు సిండికేట్ దారుల నుంచి నెల మామూళ్లు ముడుతుండడంతోనే అధికారులు దాడులు చేయడం లేదన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.