Home ఫీచర్స్ ఇంటి రూపు మార్చేయండి..!

ఇంటి రూపు మార్చేయండి..!

 house

 

ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆలోచనలతో అలంకరిస్తే ఇల్లు కంటికి ఇంపుగా కనిపిస్తుంది. సమకాలీన అందాలతో ఇల్లు మెరవాలంటే ఈ చిట్కాలు అనుసరించాలి.

ఆర్కిటెక్చరల్ మోడల్‌లో కట్టుకున్న ఇంట్లో గోడలకు సమకాలీన కళాఖండాలను అలంకరిస్తే బాగుంటుంది.
కళాత్మకంగా ఉండే పుస్తకాల ర్యాక్ గదికి ఎంతో అందం తెస్తుంది.

ఇంట్లో ముదురు రంగులు వాడడం వల్ల గదులు కాంతివంతంగా ఉంటాయి. ‘కానరీ ఎల్లో’ లాంటి రంగులు గదికి హుందా లుక్‌ని ఇస్తాయి. చూడడానికి ఎంతో మోడ్రన్‌గా కూడా కనిపిస్తాయి. ‘మింట్ గ్రీన్’ రంగుతో గదికి యూత్‌ఫుల్ లుక్ వస్తుంది. పైగా ఈ రంగు సంప్రదాయ శోభను ప్రతిఫలిస్తుంది.

అడ్వెంచర్‌సగా ఉండే రంగులు ఎంపిక చేసుకుంటే ఇల్లు విలక్షణంగా కనిపిస్తుంది.
గదిలో అలంకరించే ఫర్నిచర్ గది రంగుకు మ్యాచ్ అవ్వాలని ఏమీ లేదు.

గది మరింత అధునాతనంగా కనిపించాలంటే మెటల్‌తో మిళితమై ఉన్న టెక్చర్‌ని వాడితే బాగుంటుంది. అలాగే గదిలో పెట్టే ఫర్నిచర్ స్పేస్‌కు తగ్గ షేప్స్‌తో ఉండాలి.

ఫర్నిచర్ గ్లోబల్ స్టయిల్‌లో ఉంటే బాగుంటుంది. సాధారణంగా చాలామంది అమెరికన్, యురోపియన్, చైనీస్ ఫర్నిచర్లు ఎక్కువగా వాడుతుంటారు. కొంత కాలానికి అవిబోర్‌కొడతాయి.అలా కాకుండా కొద్దిగా వైవిధ్యంగా ఉండేలా ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఆగ్నేయాసియాలలో ఉండే ఫర్నిచర్ డెకోర్ స్టయిల్స్‌ను వాడితే ఇంటితో పాటు గదులు కూడా ప్రత్యేకంగా కనిపిస్తాయి.

ఫర్నిచర్ సర్దే తీరు కూడా విభిన్నంగా ఉండాలి.గదులను అనూహ్యమైన రీతిలో వెరైటీగా అలంకరించడమూ ఒక కళే!

Change the look of the house