Home తాజా వార్తలు ఇంగ్లండ్ జట్టులో భారీ మార్పులు… జోఫ్రా ఆర్చర్‌కు చోటు

ఇంగ్లండ్ జట్టులో భారీ మార్పులు… జోఫ్రా ఆర్చర్‌కు చోటు

లండన్: ప్రపంచకప్‌లో పాల్గొనే ఇంగ్లండ్ జట్టును ఎంపిక చేశారు. ఇంతకుముందు ప్రకటించిన జట్టులో ఉన్న ఆటగాళ్లకు ఉద్వాసన పలికి కొత్త వారికి చోటు కల్పించారు. యువ సంచనలం జోఫ్రా ఆర్చర్‌కు అనుకున్నట్టే ప్రపంచకప్ జట్టులో చోటు దక్కింది. సొంత గడ్డపై జరుగుతున్న వరల్డ్‌కప్ కోసం పటిష్టమైన జట్టును ఇంగ్లండ్ ఎంపిక చేసింది. ఇందుకు భారీ మార్పులకు కూడా వెనకాడలేదు. ఇంతకముందు ప్రకటించిన జట్టులో ఉన్న డేవిడ్ విల్లీ, జో డేన్లీ, అలెక్స్ హేల్స్‌పై వేటు వేశారు. కొంతకాలంగా పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరుస్తున్న విల్లీ, డేన్లీలకు ఊహించినట్టు షాక్ తగిలింది. ఇక, డ్రగ్స్ వివాదంలో చిక్కుకున్న హేల్స్‌కు కూడా ఉద్వాసన తప్పలేదు. మరోవైపు ఐపిఎల్‌లో అసాధారణంగా రాణించిన యువ సంచలనం ఆర్చర్‌కు జట్టులో చోటు లభించింది. ఆర్చర్‌తో పాటు లియామ్ డాసన్, జేమ్స్ విన్సీలకు చోటు కల్పించారు.

జట్టు వివరాలు: ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), జానీ బైర్‌స్టో, జాసన్ రాయ్, జోరూట్, బెన్‌స్టోక్స్, జోష్ బట్లర్, మోయిన్ అలీ, క్రిస్‌వోక్స్, లియామ్ ఫ్లంకెట్, ఆదిల్ రషీద్, మార్క్‌వుడ్, జేమ్స్‌విన్సీ, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, టామ్ కరన్.

Changes in England Team for World Cup 2019