Home ఖమ్మం విద్యుత్ లైన్ల మార్పులో సిబ్బంది ఇష్టారాజ్యం

విద్యుత్ లైన్ల మార్పులో సిబ్బంది ఇష్టారాజ్యం

 అనుమతులు లేకుండా విద్యుత్ స్తంభాల మార్పులు
 సిఎండి హెచ్చరించినా ఆగని అక్రమాలు
 కింది స్థాయి అధికారుల చేతివాటం 

 విద్యుత్ శాఖకు నష్టం

kmm2సత్తుపల్లి: విద్యుత్‌శాఖలో కింది స్థాయి అధికారుల చేతి వాటంతో ఆ శాఖకు రావాల్సిన ఆదా యానికి భారీగా గండిపడుతోంది. సిఎండి స్థాయి అధికారులు చేసే హెచ్చరికలను సైతం ఆ శాఖలోని అక్రమార్కులు పెడచెవిన పెడుతున్నారు. ఏసిబి కేసులు నమోదవుతున్నా ఏ మాత్రం లక్షపెట్టడం లేదు. ఇందుకు ఉదాహరణగా మండల పరిధిలోని రేజర్ల గ్రామంలో ఎన్టీర్ కెనాల్ సమీపంలో ఎంపి రోడ్డుకు అనుకుని ఇటీవల ఓ రైతుకు చెందిన భూమిలో వ్యవసాయ విద్యుత్ స్తంభాలను ఉన్నతాధి కారుల అనుమతులు తీసు కోకుండానే లైన్‌మెన్ మార్చి వేసినట్లు తెలిసింది. విద్యుత్ స్తంభాలను ఒకచోట నుండి మరో చోటుకు మార్చాలన్నా, ఉన్న స్తంభాలను తొలగించాలన్నా నిర్దేశిత మొత్తాన్ని డిడి రూపంలో డిఇఇ పేరు మీద జమ చేయాల్సి ఉంటుంది. అనుమతి మంజూరు అయిన తరువాతనే పనులు ప్రారం భించాలి. ఈ నిబంధనలను పక్కన పెట్టి గ్రామస్థాయిలో ఉండే విద్యుత్ సిబ్బంది వారిష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఉన్నతాధికారులకు తెలిసేలోగా మా ర్పులు, చేర్పులు పూర్త వుతున్నాయి. లైన్లు మార్చాలన్నా అను మతి తప్పనిసరి. కొత్తగా వేసే ప్రదేశానికి అనుమతి తప్పక తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండు కార్యక్రమాల వల్ల విద్యుత్ శాఖకు రైతుల నుండి ఆదాయం లభిస్తుంది. ఇలాంటి కార్యక్రమాలను కింది స్థాయిలోనే కానిచ్చేయటంతో ఆ శాఖకు రావాల్సిన ఆదాయం రావటం లేదని తెలిసింది. గతంలో ఇదే లైన్‌మెన్ పనిచేసిన చోట కూడా ఇటువంటి అక్రమాలకే పాల్పడినట్లు మండల స్థాయి అధికారులు గుర్తుచేస్తున్నారు. ఐనప్పటకీ శాఖాపరంగా ఎటు వంటి చర్యలు తీసుకోలేక పోవటాన్ని పలువురు ప్రశ్ని స్తున్నారు. గతంలో ఏసిబి కేసుల్లో సత్తుపల్లి డివిజన్‌లో తల్లాడ ఎఇ, సత్తుపల్లి డిఇఇ కేసుల్లో ఉన్నారు.
రూరల్ ఎఇగా ఉన్న సమయంలో ఇటువంటి కేసుల్లోనే సస్పెండ్ అయిన ప్పటికీ తిరిగి పట్టణ ఎఇగా కొన సాగుతున్న ఆ అధికారి పరిధిలోనే నిబంధనలకు విరుద్ధంగా పనులు జరగటం కొసమెరుపు.